7 వస్తువులను ఎవరి నుండి ఉచితంగా తీసుకోకండి..!

Never Accept These 7 Items for Free: జ్యోతిష్యం ప్రకారం.. దైనందిన జీవితంలో ఉపయోగించే కొన్ని వస్తువులను ఇతరుల నుండి ఉచితంగా స్వీకరించడం లేదా ఇవ్వడం అశుభమని భావిస్తారు. డబ్బు చెల్లించకుండా వీటిని తీసుకోవడం లేదా ఇవ్వడం వల్ల ఆర్థిక సమస్యలు, కుటుంబ వివాదాలు, అనారోగ్యాలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఈ వస్తువులను ఎప్పుడూ కొనుగోలు చేయడమే మంచిది.

ఉచితంగా తీసుకోకూడని ముఖ్యమైన వస్తువులు:

జ్యోతిష్యం ప్రకారం.. ఉచితంగా ఇవ్వకూడని లేదా తీసుకోకూడని వస్తువులు:

1. ఉప్పు

ఇంట్లో ఉప్పు అయిపోతే పొరుగువారి నుండి తీసుకోవడం పెద్ద తప్పు. ఉప్పును ఉచితంగా తీసుకోవడం లేదా ఇవ్వడం వల్ల శని దేవుడు కోపంగా ఉంటాడని జ్యోతిష్యం చెబుతోంది. ఉచితంగా ఉప్పు తీసుకోవడం వ్యాధులు మరియు లోపాలను ఆహ్వానించినట్లే అప్పుల పాలవుతారని నమ్ముతారు.

2. నల్ల నువ్వులు

నల్ల నువ్వులు శని, రాహువు మరియు కేతువుతో సంబంధం కలిగి ఉంటాయి. వీటిని ఉచితంగా ఇస్తే లేదా తీసుకుంటే, ఆ వ్యక్తి జీవితంలో అనవసరమైన ఖర్చులను ఎదుర్కోవాల్సి వస్తుంది. డబ్బు వృధా కావడం ప్రారంభమవుతుంది. శనివారం నాడు ముఖ్యంగా దీన్ని చేయకూడదు.

3. సూది

సూదులను ఉచితంగా ఇంట్లోకి తీసుకురావడం ఇంటిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ నాశనం అవుతుంది, విభేదాలు వస్తాయని నమ్ముతారు.

4. నూనె

ఎవరి దగ్గరా ఉచితంగా నూనె తీసుకోకండి. ఉచితంగా నూనె అందుకోవడం దురదృష్టంగా భావిస్తారు జీవితంలో చాలా సమస్యలు వస్తాయని నమ్ముతారు.

5. ఐరన్

ఇనుము శని దేవుడితో సంబంధం కలిగి ఉంది. కాబట్టి, డబ్బు చెల్లించకుండా ఎవరి నుండి ఇనుము తీసుకోకూడదు. మీరు ఇనుమును స్వీకరించే వ్యక్తిపై శని యొక్క ప్రతికూల ప్రభావాలు.. పడతాయని అంటారు. శనివారం

ఇనుము తీసుకోవడం లేదా ఇవ్వడం పూర్తిగా నివారించాలి.

6.

రుమాలు బహుమతిగా ఇవ్వడం లేదా స్వీకరించడం వల్ల ఇంట్లో తగాదాలు, విభేదాలు ఏర్పడతాయి. ఇది జీవితంలో అనేక సమస్యలకు దారితీస్తుంది.

7. అగ్గిపుల్ల

అగ్గిపుల్లలు అగ్ని దేవుడికి సంబంధించినవి. ఉచితంగా ఎవరి నుండి అగ్గిపుల్లలు తీసుకుంటే లేదా ఇస్తే, బంధువులు స్నేహితుల మధ్య కోపం పెరిగి వివాదాలకు దారితీయవచ్చు. ఇంట్లో శాంతికి భంగం వాటిల్లే అవకాశం ఉంది.

కాబట్టి, మీ ఇంట్లో శాంతి శ్రేయస్సు కోసం, ఈ వస్తువులను ఎప్పుడూ డబ్బు చెల్లించి కొనడం ఉత్తమం.

PolitEnt Media

PolitEnt Media

Next Story