Never Borrow These Items from Others: ఈ వస్తువులను ఇతరుల నుండి అప్పుగా తీసుకోకూడదు.. తీసుకుంటే కష్టాలు తప్పవు
తీసుకుంటే కష్టాలు తప్పవు

Never Borrow These Items from Others: వాస్తు శాస్త్రం ప్రకారం.. కొన్ని వస్తువులను ఇతరుల నుండి అప్పుగా తీసుకోవడం అశుభం. ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తి వ్యాపిస్తుందని, ఆర్థిక సమస్యలు, అనారోగ్యం, దురదృష్టం వంటివి కలుగుతాయని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. మంచి ఉద్దేశ్యంతో స్నేహితుల నుండి సహాయం తీసుకోవడం మంచి అలవాటే అయినా, కొన్ని వస్తువుల విషయంలో జాగ్రత్త వహించడం అవసరం. ఇతరుల నుండి అప్పుగా తీసుకోకూడని కొన్ని ముఖ్యమైన వస్తువుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ఇతరుల దుస్తులు ధరించవద్దు:
ఒకరి బట్టలను మరొకరు మార్చుకోవడం లేదా అప్పుగా తీసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే దుస్తులు చాలా ప్రతికూల శక్తిని కలిగి ఉంటాయి. వాస్తు నిపుణుల ప్రకారం, ఒక వ్యక్తి యొక్క ప్రతికూల శక్తి మరొక వ్యక్తికి బదిలీ అయ్యే అవకాశం ఉంది.
ఉంగరాలు తీసుకోవద్దు:
మీ స్నేహితులు ధరించిన ఉంగరాన్ని అప్పుగా తీసుకుని ధరించడం శుభం కాదు. ఉంగరం ఏ లోహం లేదా రత్నంతో తయారు చేయబడినా.. దాని గ్రహ దోషాలు మిమ్మల్ని చేరే అవకాశం ఉంది. కాబట్టి మీ ఉంగరాన్ని ఎవరికీ ఇవ్వవద్దు. ఇతరుల ఉంగరాలను తీసుకోకండి.
గడియారం :
ఒక వ్యక్తి ధరించే గడియారం కేవలం సమయాన్ని మాత్రమే కాకుండా, వారి మంచి, చెడు సమయాలను కూడా సూచిస్తుంది. అందుకే ఇతరులు ఉపయోగించిన గడియారాన్ని ధరించడం అశుభం అని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఈ అలవాటును వీలైనంత త్వరగా మానుకోవడం మంచిది.
చెప్పులు - బూట్లు :
చెప్పులు లేదా బూట్లు మార్చుకోవడం కూడా మంచిది కాదు. ఎందుకంటే మీరు వేరొకరి పాదరక్షలను ధరిస్తే.. వారి శని ప్రభావం, సమస్యలు మిమ్మల్ని కూడా బాధపెట్టవచ్చని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని ఇతరుల వస్తువులను అప్పుగా తీసుకునే విషయంలో అప్రమత్తంగా ఉండటం మంచిది. ఇది మీ జీవితంలో ప్రతికూల ప్రభావాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
