Tirupati Laddu Prasadam: శ్రీవారి లడ్డూ ప్రసాదాల ధరలను పెంచడం లేదు
ప్రసాదాల ధరలను పెంచడం లేదు

Tirupati Laddu Prasadam: శ్రీవారి లడ్డూ ప్రసాదాల ధరలను పెంచుతున్నట్లు కొందరు అవాస్తవ సమాచారాన్ని ప్రచారం చేయడం సరికాదని టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానముల ప్రతిష్టను, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతో ఇలాంటి చౌకబారు వార్తలను ప్రచారం చేయడం తగదన్నారు. ఇలాంటి వార్తలు పూర్తి అబద్దమైనవని, ఆధారాలు లేని వార్తలని ఆయన ఖండించారు. ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. టిటిడి లడ్డూ ప్రసాదాల ధరలను పెంచే ఆలోచనేలేదని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తిరుమల శ్రీవారి పరకామణి కేసులో ఏ ఒక్కరు తప్పించుకోలేరన్నారు టీటీడీ పాలకమండలి సభ్యులు డాలర్స్ దివాకర్ రెడ్డి. ఈ కేసులో అసలు సూత్రధారులు త్వరలోనే బయటపడతారని.. కోట్లాది రూపాయలు దోచేస్తే లోక్ అదాలత్ లో కేసును పరిష్కరించడమేంటి అని ప్రశ్నించారు. భగవంతుడిని దోచేసిన వ్యక్తులు కూడా మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు.
