ఆంక్షలు లేవు

Tirumala: తిరుమలకు వచ్చే ప్రైవేటు వాహనాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు, రోజుకు 15,000 వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని, ఆ తరువాత వచ్చే వాహనాలను చెక్‌పాయింట్ల వద్ద నిలిపివేస్తారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం టీటీడీ దృష్టికి వచ్చింది.
ఇది పూర్తిగా అవాస్తవం. తిరుమలకు వచ్చే ప్రైవేటు వాహనాల సంఖ్యపై ఈ తరహా ఎలాంటి నిర్ణయాన్ని టీటీడీ తీసుకోలేదు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తను భక్తులు నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
టీటీడీకి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు, సమాచారం అధికారిక టీటీడీ ప్రకటనల ద్వారా మాత్రమే తెలియజేయబడతాయి. వాస్తవాలను నిర్ధారించుకోకుండా ఇలాంటి అవాస్తవ సమాచారాన్ని ప్రచారం చేయడం ద్వారా భక్తులను అయోమయానికి గురిచేయడం సరికాదు.
టీటీడీ పేరుతో తప్పుడు వార్తలు, అవాస్తవ సమాచారాన్ని ప్రచారం చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించడమైనది.

