Padarasa Shiva Lingam Worship: హిందూ సంప్రదాయంలో శివారాధనకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. మనం సాధారణంగా రాయి, వెండి లేదా ఇత్తడితో చేసిన శివలింగాలను చూస్తుంటాం. అయితే శివుని అనుగ్రహాన్ని తక్షణమే పొందడానికి 'పాదరస శివలింగ పూజ అత్యంత ప్రభావవంతమైనదని ఆధ్యాత్మిక శాస్త్రాలు చెబుతున్నాయి. దీని విశిష్టత మరియు పూజా ఫలాలు ఇప్పుడు తెలుసుకుందాం.

48 రోజుల మండల దీక్షతో సమస్యలకు చెక్..

జీవితంలో తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటున్న వారు, ఆర్థిక లేదా వ్యక్తిగత సమస్యల నుండి బయటపడలేక ఇబ్బంది పడుతున్న వారు పాదరస శివలింగాన్ని ఆశ్రయించడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ఎవరైతే వరుసగా 48 రోజుల పాటు ఈ శివలింగానికి భక్తితో అభిషేకం చేస్తారో, వారికి ఎలాంటి కష్టాలు ఉన్నా తొలగిపోయి శుభ ఫలితాలు లభిస్తాయి. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి, కొద్దిగా నీటిని సమర్పించినా భోళాశంకరుడు తక్షణమే అనుగ్రహిస్తాడు.

పూర్వజన్మ పాపాలకు ప్రాయశ్చిత్తం

పురాణాల ప్రకారం, ఒక బంగారు శివలింగాన్ని పూజించడం వల్ల కలిగే పుణ్యం కంటే, పాదరస శివలింగాన్ని పూజించడం వల్ల కోటి రెట్లు ఎక్కువ ఫలితం దక్కుతుంది.

పవిత్ర తీర్థం:

ప్రతి సోమవారం సాయంత్రం పాదరస శివలింగానికి అభిషేకం చేసి, ఆ నీటిని పవిత్ర తీర్థంగా స్వీకరిస్తే పూర్వజన్మల కర్మలు, పాపాలు తొలగిపోతాయని నమ్మకం. ఇది ఒక ఔషధంలా పనిచేసి మనసులోని అలజడిని తగ్గించి, సమస్యలను క్రమంగా దూరం చేస్తుంది.

సకల దేవతల ఆశీస్సులు - ఆరోగ్యం

పాదరస శివలింగాన్ని పూజించడం వల్ల కేవలం పరమేశ్వరుని ఆశీస్సులే కాకుండా, లక్ష్మీదేవిఫ కుబేరుని అనుగ్రహం కూడా లభిస్తుంది.

ఆరోగ్య ప్రాప్తి:

ఈ శివలింగానికి అభిషేకం చేసిన నీటిని స్నానం చేసే నీటిలో కలుపుకుంటే, దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడేవారికి త్వరగా ఉపశమనం లభిస్తుంది.

ఇంట్లో ఉంచుకోవచ్చు: ఈ శివలింగాన్ని ఇంట్లో ఉంచుకుని కూడా పూజించవచ్చు. దీనివల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూలత పెరుగుతుంది.

పూజా విధానం

పాదరస శివలింగ పూజకు ప్రత్యేకమైన కఠిన నియమాలు లేదా మంత్రాలు అవసరం లేదు. మనసులో శివునిపై భక్తి ఉంచి, నిష్టతో జల అభిషేకం చేస్తే చాలు. భక్తితో సమర్పించే ఒక గ్లాసు నీరైనా శివుని శాంతింపజేసి మీ జీవితంలో వెలుగు నింపుతుంది.

Next Story