పాటించాల్సిన నియమాలు ఇవే

Pitru Paksha: హిందూ మతంలో పూర్వీకులకు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చే పితృ పక్షం ఈ సంవత్సరం సెప్టెంబర్ 7 నుండి ప్రారంభం కానుంది. ఈ 15 రోజుల కాలంలో పితృ దేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారు. ఈ కర్మలు చేయడం ద్వారా పూర్వీకుల ఆశీస్సులు కుటుంబంపై ఉంటాయని నమ్ముతారు. పితృ పక్షంలో పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాలను తెలుసుకుందాం.

పితృ పక్షంలో చేయాల్సినవి

దానం: ఈ సమయంలో దానధర్మాలకు విశేష ప్రాముఖ్యత ఉంది. పితృ పక్షంలో ప్రతి ఒక్కరూ తమ శక్తి మేరకు దానం చేయాలి. ఇది పూర్వీకుల ఆత్మలకు శాంతిని కలిగిస్తుందని నమ్ముతారు.

బ్రాహ్మణులకు ఆహారం: పితృ పక్షంలో బ్రాహ్మణులను గౌరవించి ఆహ్వానించాలి. వారికి భోజనం పెట్టి, దక్షిణ ఇవ్వడం ద్వారా పూర్వీకులు సంతోషిస్తారని పురాణాలు చెబుతున్నాయి.

తర్పణం, పిండదానం: పితృ పక్ష సమయంలో శ్రద్ధ, తర్పణం మరియు పిండదానం వంటి కర్మలు చేయడం తప్పనిసరి. ఈ కర్మలు చేయడం ద్వారా పూర్వీకులు తృప్తి చెంది కుటుంబ సభ్యులను ఆశీర్వదిస్తారని నమ్ముతారు.

జంతువులకు, పక్షులకు ఆహారం: పితృ పక్షం సమయంలో జంతువులు, పక్షులకు ఆహారం పెట్టడం చాలా శుభప్రదం. ముఖ్యంగా ఆవులు, కాకులకు ఆహారం ఇవ్వడం వలన పితృ దేవతలు సంతృప్తి చెందుతారని విశ్వాసం.

పాటించకూడనివి

పితృ పక్షంలో మాంసం, మద్యం వంటివి సేవించకూడదు. ఈ 15 రోజులు పూర్వీకులు భూమిపైకి వస్తారని, అందుకే ఇటువంటి పనులు చేయకూడదని పెద్దలు చెబుతారు.

పితృ పక్షంలో ఈ నియమాలను పాటించడం ద్వారా పితృ దేవతల ఆశీస్సులు పొందడమే కాకుండా, కుటుంబంలో సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయని పండితులు చెబుతున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story