ఏమేం చేయాలో తెలుసా?

Poli Padyami: నేటితో కార్తీక మాసం ముగియనుంది. కార్తీక అమావాస్య తర్వాత రోజున పోలి పాడ్యమిని జరుపుతారు. ఈసారి అది శుక్రవారం వస్తోంది. కార్తీక వ్రతం ఆచరించినవారు ఆ పుణ్యాన్ని రెట్టింపు చేసుకోవడానికి ఆవు నెయ్యితో వెలిగించిన 31 వత్తుల దీపాలను అరటి దొప్పలలో పెట్టి నదీ జలాల్లో నిమజ్జనం చేస్తారు. ఇలా చేస్తే కుటుంబంలో దారిద్ర్యం తొలగిపోతుందని నమ్మకం.

పోలి పాడ్యమి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి, 30 వత్తుల దీపం వెలిగించాలి. దాన్ని అరటి దొప్పలలో పెట్టి పారే నీటిలో వదలాలి. తద్వారా కార్తీక మాస దీపారాధన పుణ్యం లభిస్తుందని నమ్మకం. ఆ తర్వాత శివాలయానికి వెళ్లి, శివ లింగానికి అభిషేకం చేసి ‘ఓం నమశ్శివాయ’ అనే మంత్రాన్ని జపించాలి. సాయంత్రం తులసి కోట వద్ద దీపాలు వెలిగించి, పోలి స్వర్గం కథ విని, దీపదానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

పోలి పాడ్యమిని నవంబర్ 21వ తేదీన(శుక్రవారం) జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ‘పాడ్యమి తిథి నవంబర్ 20 ఉదయం 10:30కి ప్రారంభమై, నవంబర్ 21 మధ్యాహ్నం 12:45 వరకు ఉంటుంది. సూర్యోదయాన్ని పరిగణనలోకి తీసుకొని నవంబర్ 21నే పోలి పాడ్యమి నిర్వహించాలి. ఇక నవంబర్ 22, 2025 శనివారం తెల్లవారుజామున 4:35 నుంచి 6:00 గంటల వరకు దీపాలను నీటిలో వదలడానికి అనుకూల సమయం’ అని చెబుతున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story