హోటల్‌ నిర్వాహకుల భేటీలో టిటిడి ఈవో జె. శ్యామలరావు

తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు బిగ్, జనతా క్యాంటిన్లలో నాణ్యమైన ఆహార పదార్ధాలు అందించాలని టిటిడి ఈవో జె.శ్యామలరావు కోరారు. టిటిడి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో గుర్తింపు ఉన్న హోటళ్ల నిర్వాహకులతో టిటిడి అదనపు ఈవో సిహెచ్.వెంకయ్య చౌదరితో కలిసి ఈవో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, శ్రీవారి దర్శనం కోసం ప్రపంచ వ్యాప్తంగా భక్తులు వస్తుంటారని, వారికి సేవా దృక్పధంతో నాణ్యమైన ఆహార పదార్థాలు, పరిశుభ్రత, లాభాపేక్ష లేకుండా నిర్ధేశించిన ధరలకు అందించాలన్నారు. తిరుమలలో బిగ్, జనతా క్యాంటిన్ల నిర్వహణ కోసం గత నెల 23వ తేదీ నోటిఫిషన్ జారీ చేశారు. సదరు ఈవోఐ సంబంధించిన సందేహాలపై గుర్తింపు ఉన్న హోటళ్ల నిర్వాహకులు తమ ఆసక్తిని వ్యక్తం చేసేందుకు ఫ్రీ బిడ్ మీటింగ్ ను టిటిడి ఈవో జె.శ్యామల రావు, టిటిడి అదనపు ఈవో సిహెచ్. వెంకయ్య చౌదరి నిర్వహించారు. నిర్థారించిన నియమాలకు లోబడి బిగ్, జనతా క్యాంటిన్ లో కేటాయింపు ఉంటుందని ఈ సందర్భంగా ఈఓ చెప్పారు. బిగ్, జనతా హోటళ్ల నిర్వహణలో టెండర్ ప్రాసెస్ మరియు తదితర నియమ నిబంధనలను ఈఓని అడిగి తెలుసుకుని గుర్తింపు, ఆసక్తి ఉన్న హోటళ్ల నిర్వాహకులు నివృత్తి చేసుకున్నారు. హోటళ్ల నిర్వాహకులు పలు సందేహాలు వ్యక్తం చేయగా వాటిని టిటిడీ ఈవో, అదనపు ఈవో నివృత్తి చేశారు. ఈ సమావేశంలో అదనపు ఎఫ్.ఏ.ఓ రవి ప్రసాదు, తిరుమల ఎస్టేట్ ఆఫీసర్ కె. వెంకటేశ్వర్లు, పలు హోటళ్ల నిర్వాహకులు పాల్గొన్నారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story