ఏ రాశుల వారికి శుభం, ఏ రాశుల వారికి అశుభం?

Rahu-Shadowed Lunar Eclipse: 2025లో జరగనున్న రాహుగ్రస్త చంద్రగ్రహణం జ్యోతిషశాస్త్రంలో ఒక ముఖ్యమైన సంఘటన. ఈ గ్రహణం వివిధ రాశులపై చూపించే ప్రభావం మూడు నెలల వరకు కొనసాగుతుందని పండితులు తెలిపారు.

శుభ ఫలితాలు పొందే రాశులు

ధనుస్సు, కన్య, వృషభం, మేష రాశులకు ఈ గ్రహణం చాలా శుభప్రదమని పండితులు తెలిపారు. ఈ రాశుల వారు గ్రహణం సమయంలో ధ్యానం, జపం, ఆధ్యాత్మిక కార్యకలాపాలలో పాల్గొనడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. అయితే,ఈ సమయంలో అధిక ఆనందం లేదా అజాగ్రత్తను నివారించాలని ఆయన సూచించారు.

మిశ్రమ ఫలితాలు పొందే రాశులు

మకరం, తుల, సింహ, మిథున రాశుల వారికి ఈ గ్రహణం ప్రభావం మిశ్రమంగా ఉంటుంది. ఈ రాశుల వారు తమ నిర్ణయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించాలి. దేవతా పూజ, ప్రార్థనల ద్వారా గ్రహణం యొక్క ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని సలహా ఇచ్చారు.

అశుభ ఫలితాలు పొందే రాశులు

కుంభం, మీనం, కర్కాటకం, వృశ్చిక రాశులకు ఈ గ్రహణం అశుభకరమని తెలిపారు. ఈ రాశుల వారు గ్రహణం సమయంలో మానసిక ఒత్తిడి, కోపం, ఆందోళనను అనుభవించవచ్చు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడంలో, డ్రైవింగ్ చేయడంలో జాగ్రత్త అవసరం. గ్రహణం యొక్క ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఈ రాశుల వారు ధ్యానం, జపం, ప్రార్థనలు చేయడం మంచిది. ఈ సమయంలో చంద్ర బీజ మంత్రం “ఓం శ్రమం శ్రీం శ్రౌం సహచంద్రాయ నమః”, గాయత్రీ మంత్రాన్ని జపించడం వల్ల అందరికీ శాంతి లభిస్తుందని పండితులు చెప్పారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story