ఏ టైమ్ లో రాఖీ కడితే మంచిది?

Raksha Bandhan: రాఖీ పండుగ శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకుంటారు. ఈ సంవత్సరం పౌర్ణమి తిథి ఆగస్టు 8న మధ్యాహ్నం 2:12 గంటలకు మొదలై ఆగస్టు 9న మధ్యాహ్నం 1:24 గంటలకు ముగుస్తుంది. ఆగస్టు 9, 2025, శనివారం ఉదయం 5:47 గంటల నుండి మధ్యాహ్నం 1:24 గంటల వరకు రాఖీ కట్టడానికి చాలా మంచి సమయం. ఈ సమయంలో భద్ర కాలం ఉండదు. భద్ర కాలం ఆగస్టు 8న మధ్యాహ్నం 2:12 గంటలకు మొదలై ఆగస్టు 9న తెల్లవారుజామున 1:52 గంటలకు ముగుస్తుంది. హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం, భద్ర కాలంలో ఏ శుభకార్యం చేయరు కాబట్టి, ఆ సమయాన్ని తప్పక నివారించాలి. అయితే, ఆగస్టు 9న ఉదయం 9:08 నుంచి 10:47 వరకు రాహుకాలం ఉంటుంది. ఈ సమయంలో కూడా రాఖీ కట్టకుండా ఉండటం మంచిది. సూర్యోదయానికి పౌర్ణమి తిథి ఉన్న ఆగస్టు 9నే రక్షాబంధన్ జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఈసారి 95 ఏళ్ల తర్వాత అద్భుతమైన యోగాలు ఏర్పడుతున్నాయని, ఈ సమయంలో రాఖీ కట్టడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయని చెబుతున్నారు. కాబట్టి, ఆగస్టు 9న ఉదయం 5:47 నుండి మధ్యాహ్నం 1:24 గంటల మధ్య, రాహుకాలం (ఉదయం 9:08 నుంచి 10:47 వరకు) మినహాయించి, ఏ సమయంలోనైనా రాఖీ కట్టుకోవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story