Rare Ashta Lakshmi Rajyoga in Shravan: పవిత్ర శ్రావణ మాసానికి ఆధ్యాత్మికంగానే కాకుండా జ్యోతిష్య శాస్త్రంలోనూ విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో గురుడు, శుక్రుడు శుభ స్థానాల్లో సంచరిస్తూ అత్యంత శక్తివంతమైన అష్టలక్ష్మి రాజయోగాన్ని ఏర్పరుస్తున్నారు. జ్యోతిష్య రీత్యా శుభగ్రహాలు, సంపద కారకులైన గురు, శుక్రుల కలయికతో ఏర్పడుతున్న ఈ రాజయోగం నాలుగు ప్రధాన రాశుల వారికి అద్భుతమైన ఫలితాలను, ఆర్థిక శ్రేయస్సును అందించనుంది. ఆ అదృష్ట రాశుల వివరాలు..

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి జాతకులకు అష్టలక్ష్మి రాజయోగం అపారమైన ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుంది. వీరు ప్రారంభించే ప్రతి పనిలోనూ ఊహించని విజయం లభిస్తుంది. కొత్త ఆదాయ వనరులు పెరిగి ఆర్థిక పరిస్థితి గణనీయంగా బలపడుతుంది.దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తొలగిపోయి, కుటుంబంలో నెలకొన్న అడ్డంకులు సమసిపోతాయి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ సమయం అత్యంత శాంతియుతంగా, సంతోషకరంగా సాగుతుంది. పడిన కష్టానికి తగిన ప్రతిఫలం లభించి, ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఇటు కుటుంబంలో, అటు వృత్తి/ఉద్యోగ రంగాల్లో పూర్తి సానుకూల వాతావరణం నెలకొంటుంది. వ్యాపారస్తులకు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఊహించిన దానికంటే భారీ లాభాలు అందుతాయి.

సింహ రాశి

సింహ రాశి జాతకులకు సమాజంలో కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విద్యార్థులు ఉన్నత విద్యారంగంలో రాణించి, పోటీ పరీక్షల్లో ప్రతిభకు తగిన ఫలితం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు, వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని విస్తరించడానికి, కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది ఎంతో అనుకూలమైన సమయం.

కన్యా రాశి

కన్యా రాశి వారికి అన్ని రంగాల్లోనూ విజయాలు ఎదురవుతాయి. ఉద్యోగ, వ్యాపార రీత్యా చేసే దూర ప్రయాణాలు భవిష్యత్తులో విశేష లాభాలను తెచ్చిపెడతాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు శుభవార్తలు అందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కెరీర్‌లో నూతన అవకాశాలు అందివచ్చి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story