Rare Gajakesari Rajyoga in Early October: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలు, వాటి కలయికలకు విశేష ప్రాధాన్యత ఉంది. ప్రతి నెలా గ్రహాలు తమ స్థానాలను మార్చుకుంటూ మానవ జీవితంపై శుభాశుభ ప్రభావాలను చూపుతుంటాయి. ఈ క్రమంలోనే రాబోయే అక్టోబర్ ప్రారంభంలో అత్యంత శక్తిమంతమైన, శుభప్రదమైన గజకేసరి రాజయోగం ఏర్పడనుంది. దేవగురు బృహస్పతి, మనఃకారకుడైన చంద్రుడి కలయిక వల్ల ఏర్పడే ఈ యోగం పలు రాశుల వారికి అపారమైన ధనలాభం, వృత్తిపరమైన ఎదుగుదలను తీసుకురానుంది.

కర్కాటక రాశిలో గురు-చంద్రుల కలయిక..

జ్యోతిష్య పండితుల ప్రకారం, ఇప్పటికే కర్కాటక రాశిలో గురు గ్రహం సంచరిస్తోంది. ఈ క్రమంలో అక్టోబర్ 4న చంద్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. కర్కాటకంలో ఈ రెండు శుభ గ్రహాల కలయిక అత్యంత పవిత్రమైన గజకేసరి యోగాన్ని సృష్టిస్తుంది. ఈ యోగం అక్టోబర్ 6వ తేదీ రాత్రి సుమారు 10:17 గంటల వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత చంద్రుడు సింహరాశిలోకి ప్రవేశించడంతో ఈ యోగం ముగుస్తుంది. ఈ కాలంలో జ్ఞానం, ఆర్థికాభివృద్ధి, వృత్తిపరమైన గుర్తింపు లభిస్తుందని నమ్ముతారు. అయితే ఈ ప్రభావం అన్ని రాశులపై ఉన్నప్పటికీ, ప్రధానంగా మూడు రాశుల వారికి విశేషమైన అదృష్టాన్ని తెచ్చిపెట్టనుంది. ఆ రాశులేవో వివరంగా తెలుసుకుందాం..

తులా రాశి

తులా రాశి వారికి పదవ స్థానంలో గురు-చంద్రుల కలయిక జరుగుతుంది. ఉద్యోగస్తులకు పని ప్రదేశంలో సరికొత్త బాధ్యతలు దక్కుతాయి. చేపట్టిన ప్రతి పనిలో విజయం వరిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారస్తులకు ఊహించని రీతిలో లాభాలు అందుతాయి. గతంలో కంటే ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ఆర్థిక లాభాలు ఉన్నప్పటికీ, కొత్తగా భారీ పెట్టుబడులు పెట్టేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి అడుగు వేయడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఏడవ స్థానంలో ఈ గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి మంచి లాభాలను తెచ్చిపెట్టే సరికొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఉద్యోగంలో పదోన్నతులు లేదా అదనపు బాధ్యతలు పొందే అవకాశముంది. వైవాహిక జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. జీవిత భాగస్వామితో సంబంధాలు మరింత బలపడతాయి. కుటుంబంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో భాగస్వామి నుంచి పూర్తి మద్దతు, సహకారం లభిస్తాయి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఆరవ స్థానంలో ఈ యోగం రూపం దాల్చుతుంది. ఆఫీసులో మీ పనితీరుకు ప్రశంసలు లభించడంతో పాటు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. మీ నైపుణ్యాలను నిరూపించుకోవడానికి సరైన వేదిక దొరుకుతుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తి చేసి సత్ఫలితాలు సాధిస్తారు. విద్యార్థులు తమ కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. వ్యాపారులకు కొత్త ప్రాజెక్టులు చేతికి వస్తాయి. అయితే ఈ సమయంలో నిరంతర శ్రమ, అంకితభావం కొనసాగించినప్పుడే పూర్తి విజయం సొంతమవుతుంది.

Next Story