ఆ మూడు రాశుల వారికి ఇక అదృష్టమే అదృష్టం..

Rare Gajakesari Yoga Tomorrow: జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శక్తివంతమైన, శుభప్రదమైన యోగాలలో గజకేసరి యోగం ఒకటి. రేపు, అంటే మార్చి 26న మిథున రాశిలో గురు, చంద్ర గ్రహాల కలయిక వల్ల ఈ విశేష యోగం ఏర్పడబోతోంది. దీని ప్రభావంతో కొన్ని రాశుల వారి జాతకాలు ఒక్కసారిగా మారిపోనున్నాయి.

గజకేసరి యోగం అంటే ఏమిటి?

గజ అంటే ఏనుగు - ఇది సంపద, స్థిరత్వానికి చిహ్నం. 'కేసరి' అంటే సింహం - ఇది అధికారం, నాయకత్వానికి ప్రతీక. జాతక చక్రంలో గురు, చంద్రులు కలిసినప్పుడు లేదా ఒకరికొకరు కేంద్ర స్థానాల్లో ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం ఉన్న వ్యక్తులు సమాజంలో గౌరవం, అపారమైన తెలివితేటలు, ఉన్నత పదవులను పొందుతారు.

ప్రధానంగా లాభపడే ఆ మూడు రాశులు ఇవే..

మిథున రాశి:

మిథున రాశిలోనే ఈ యోగం ఏర్పడుతుండటంతో వీరికి తిరుగులేని అదృష్టం వరించనుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. పై అధికారుల నుండి ప్రశంసలు, పదోన్నతులు పొందే అవకాశం ఉంది.

సింహ రాశి:

సింహ రాశి వారికి 11వ స్థానంలో ఈ యోగం ఏర్పడుతోంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఆర్థికంగా బలోపేతం అవుతారు. పెండింగ్‌లో ఉన్న పనులు వేగంగా పూర్తవుతాయి. సమాజంలో హోదా పెరగడంతో పాటు ప్రశంసలు దక్కుతాయి.

కన్యా రాశి :

కన్యా రాశి వారికి 10వ స్థానంలో గజకేసరి యోగం ఏర్పడటం విశేషం. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది, కొత్త లక్ష్యాలను చేరుకుంటారు.చాలా కాలంగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు జీతాల పెరుగుదల లేదా ప్రమోషన్ వచ్చే సూచనలు ఉన్నాయి.

ఈ గజకేసరి యోగం అన్ని రాశుల వారికి ఏదో ఒక రకమైన సానుకూల మార్పులను తెచ్చినప్పటికీ, పైన పేర్కొన్న మూడు రాశుల వారు మాత్రం అద్భుతమైన ఫలితాలను అందుకుంటారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story