Rare Mars-Jupiter Conjunction in Cancer: జ్యోతిష్య శాస్త్రంలో దేవగురువు బృహస్పతి, గ్రహాల సేనాధిపతి కుజుడికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. ఒక జాతకంలో ఈ రెండు గ్రహాలు బలంగా ఉంటే ఆ వ్యక్తి సమాజంలో కీర్తి ప్రతిష్టలు, అధికారంతో పాటు సకల భోగభాగ్యాలను అనుభవిస్తాడని శాస్త్రం చెబుతోంది. అదృష్టం, శ్రేయస్సు, జ్ఞానానికి కారకుడైన గురు భగవానుడు ప్రస్తుతం తన ఉచ్ఛ క్షేత్రమైన కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఇదే కర్కాటకంలోకి కుజుడు కూడా ప్రవేశించడంతో అత్యంత శక్తివంతమైన కుజ-గురు సంయోగం ఏర్పడింది. ఈ రెండు శుభ గ్రహాలు అక్టోబర్ 31 వరకు కర్కాటకంలోనే కలిసి ప్రయాణించనున్నాయి. అంటే అక్టోబర్ నెల పూర్తయ్యే వరకు ఈ సంయోగం కొనసాగుతుంది. ద్వాదశ రాశులపై దీని ప్రభావం ఉన్నప్పటికీ, ప్రత్యేకించి మూడు రాశుల వారికి ఈ కలయిక అదృష్టాన్ని, ఆర్థిక పురోగతిని అందించనుంది. ఆ రాశుల వివరాలు:

వృషభ రాశి: పట్టిందల్లా బంగారం.. కెరీర్‌లో కీలక మలుపు

వృషభ రాశి వారికి తృతీయ స్థానంలో ఈ సంయోగం జరుగుతోంది. నిరుద్యోగులకు కోరుకున్న మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగస్తులు తమ ప్రతిభకు తగిన గుర్తింపు, ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారస్తులు ప్రారంభించిన కొత్త ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. జీవిత భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది. పరస్పర అవగాహన పెరిగి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మిత్రులు, బంధువుల నుంచి పూర్తి సహాయ సహకారాలు అందుతాయి.

---

తులా రాశి

తులారాశి వారికి దశమ భావమైన కర్మ స్థానంలో కుజ, గురుల కలయిక ఏర్పడుతోంది. వృత్తిపరంగా ఈ కాలం అత్యంత అనుకూలమైనది. తాము కోరుకున్న ప్రదేశానికి బదిలీ లేదా పదోన్నతి లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి భారీగా రాబడులు అందుతాయి. స్థిరాస్తుల కొనుగోలు లేదా ఆస్తి సంబంధిత వ్యవహారాల్లో సానుకూల ఫలితాలు వస్తాయి. అవివాహితులకు అనుకూలమైన సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరిగి దైవ దర్శనాలు చేసుకుంటారు.

ధనుస్సు రాశి: విదేశీ యోగం.. శుభవార్తల వెల్లువ!

ధనుస్సు రాశి వారికి అష్టమ స్థానంలో ఈ రెండు గ్రహాలు సంచరిస్తున్నాయి. విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే వారికి, విదేశీ ప్రాజెక్టులతో సంబంధం ఉన్నవారికి ఊహించని ధనలాభం చేకూరుతుంది. వీసా లేదా విదేశీ ప్రయాణాలకు మార్గం సుగమమవుతుంది. ఉన్నత చదువులు చదివే విద్యార్థులు తమ కృషికి తగిన అత్యుత్తమ ఫలితాలను సాధిస్తారు. కుటుంబంలో ఒకదాని వెనుక ఒకటి శుభవార్తలు వినిపిస్తాయి. ఆదాయం పెరిగి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. మానసిక ప్రశాంతత, ఉల్లాసం చేకూరుతాయి.

Next Story