Rare Rajayogas After 100 Years During Navratri: శరన్నవరాత్రుల వేళ గ్రహాల సంచారం విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. అక్టోబర్ 11న ప్రారంభమైన దేవీ నవరాత్రులు అక్టోబర్ 19 వరకు కొనసాగుతుండగా, అక్టోబర్ 20న విజయదశమి పండుగను జరుపుకోనున్నారు. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం దాదాపు 100 సంవత్సరాల తర్వాత ఈ నవరాత్రుల కాలంలో అత్యంత అరుదైన గ్రహ సంయోగాలు చోటుచేసుకుంటున్నాయి. నవరాత్రుల వేళ సూర్య-బుధుల కలయికతో బుధాదిత్య రాజయోగం, బుధ-శుక్రుల కలయికతో లక్ష్మీ నారాయణ రాజయోగం, చంద్ర-గురుల కలయికతో మహా శక్తివంతమైన గజకేసరి రాజయోగం ఏకకాలంలో ఏర్పడుతున్నాయి. ఒకే సమయంలో ఇన్ని రాజయోగాలు ఏర్పడటం అత్యంత అరుదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ రాజయోగాల ప్రభావంతో దుర్గాదేవి ప్రత్యేక అనుగ్రహం పొందుతూ, అదృష్టాన్ని సొంతం చేసుకోనున్న ఆ రాశులేంటో చూద్దాం.

మేష రాశి

మేష రాశి వారికి ఈ నవరాత్రులు ఊహించని ప్రయోజనాలను చేకూర్చనున్నాయి.దీర్ఘకాలంగా మొండిబకాయిలుగా ఉన్న ధనం తిరిగి చేతికి అందుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగంలో ఎదురవుతున్న అవరోధాలు తొలగిపోయి ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. వ్యాపారస్తులకు అధిక లాభాలను తెచ్చిపెట్టే సరికొత్త కాంట్రాక్టులు దక్కుతాయి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి జాతకులకు ఈ అరుదైన రాజయోగాలు సంతోషకరమైన వాతావరణాన్ని కలిగిస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు, విద్యార్థులు చదువులో రాణించి ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. నూతన ఒప్పందాలు కుదిరి వ్యాపారంలో లాభాలు ఊపందుకుంటాయి. కొత్తగా ఏర్పడే పరిచయాలు, స్నేహాలు భవిష్యత్తులో విశేషమైన ఆర్థిక లాభాలను తెచ్చిపెడతాయి.

సింహ రాశి

సింహ రాశి వారికి జగన్మాత ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయి. అనుకోని మార్గాల ద్వారా నూతన ఆదాయ వనరులు సమకూరి, ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మరింత బలోపేతం అవుతుంది. రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ లేదా ఇతర రంగాల్లో కొత్త పెట్టుబడులు పెట్టాలని భావించే వారికి ఇది అత్యంత అనుకూలమైన కాలం.

తులా రాశి

తులారాశి వారికి ఈ రాజయోగాలు విశేష ఐశ్వర్యాన్ని, ప్రశాంతతను అందించనున్నాయి. పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తులు, వారసత్వ సంపద ద్వారా ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లతో పాటు ఇంక్రిమెంట్లు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారాన్ని ఇతర ప్రాంతాలకు విస్తరించి అధికాదాయం పొందుతారు. కుటుంబంలో సంతోషం, శాంతి నెలకొంటాయి.

Next Story