ఈ 4 రాశుల వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకోనున్నాయి..

Rare Rajyogas on April 17 Amavasya: సాధారణంగా అమావాస్య అంటే కొంచెం భయం, అశాంతి ఉంటుందని చాలామంది భావిస్తారు. కానీ 2026 ఏప్రిల్ 17న రాబోయే అమావాస్య జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అత్యంత పవిత్రమైనదిగా, అదృష్టదాయకంగా మారబోతోంది. ఈ రోజున గురు, శుక్ర గ్రహాల సంచారంతో పాటు చంద్రుడు మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ గ్రహాల కలయిక వల్ల జాతక చక్రంలో బుధాదిత్య రాజయోగం, మంగళాదిత్య రాజయోగం వంటి శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. దీనివల్ల 4 రాశుల వారికి రాజభోగాలు పట్టనున్నాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

రాజయోగం పట్టబోయే ఆ 4 రాశులు ఇవే..

కుంభ రాశి :

కుంభ రాశి వారికి ఈ అమావాస్య కొత్త కాంతిని తీసుకువస్తుంది. వైవాహిక జీవితంలోని విభేదాలు తొలగి సామరస్యం పెరుగుతుంది. ముఖ్యంగా మీడియా, కళలు, సృజనాత్మక రంగాలలో ఉన్న వారికి సమాజంలో గొప్ప గుర్తింపు, గౌరవం లభిస్తాయి. అదృష్టం మీకు పూర్తి స్థాయిలో అండగా ఉంటుంది.

కర్కాటక రాశి :

కర్కాటక రాశి వారికి ఇది ఒక రకంగా కొత్త జీవితం ప్రారంభమైనట్లే. కొత్త వ్యాపారాలు లేదా వినూత్న ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. చిక్కుల్లో ఉన్న డబ్బు తిరిగి రావడమే కాకుండా, ఆర్థికంగా స్థిరపడతారు. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది.

ధనుస్సు రాశి:

వృత్తిపరమైన ఎదుగుదలకు ఈ కాలం ధనుస్సు రాశి వారికి వరప్రసాదం. నిరుద్యోగులకు ప్రముఖ సంస్థల నుండి ఆఫర్లు వస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి లేదా ఆశించిన చోటికి బదిలీ జరిగే అవకాశం ఉంది. పాత అప్పుల నుండి బయటపడటానికి మార్గాలు సుగమం అవుతాయి.

తుల రాశి :

తుల రాశి వారికి ఈ సమయం సామాజిక గౌరవాన్ని పెంచుతుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీకు లాభాలను చేకూరుస్తుంది. సమాజంలోని పలుకుబడి గల వ్యక్తుల పరిచయం మీ భవిష్యత్తుకు మార్గం చూపుతుంది. జీవిత భాగస్వామితో ఉన్న సమస్యలు పరిష్కారమై సంతోషంగా గడుపుతారు.

అరుదైన ఈ గ్రహ సంచారం వల్ల ఈ నాలుగు రాశుల వారికి ఆర్థిక సమస్యలు తొలిగి, వృత్తిపరంగా అపూర్వ విజయాలు దక్కనున్నాయి. అమావాస్య రోజున దైవ ప్రార్థన చేయడం ద్వారా ఈ రాజయోగాల ఫలితాలను మరింత సమర్థవంతంగా పొందవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story