Rare Triple Planetary Conjunction in Leo: సింహ రాశిలో అరుదైన త్రిగ్రహ యోగం.. ఈ 3 రాశుల వారికి కెరీర్, వ్యాపారంలో ఊహించని ప్రయోజనాలు
వ్యాపారంలో ఊహించని ప్రయోజనాలు

Rare Triple Planetary Conjunction in Leo: జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాల సంచారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గ్రహాల కలయిక వల్ల ఏర్పడే వివిధ యోగాలు మానవ జీవితంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. దేవగురువుగా భావించే బృహస్పతి సింహ రాశిలోకి ప్రవేశించగా, ఇప్పటికే ఆ రాశిలో కేతువు సంచరిస్తున్నాడు. ఈ క్రమంలో నవంబర్ 12న కుజుడు సైతం సింహ రాశిలోకి అడుగుపెట్టనుండటంతో ఒకే రాశిలో గురు, కేతు, కుజ గ్రహాల కలయికతో అత్యంత శక్తిమంతమైన త్రిగ్రహ యోగం రూపుదిద్దుకోనుంది. ఈ మూడు శక్తిమంతమైన గ్రహాల కలయిక ప్రభావం ద్వాదశ రాశులపై పడినప్పటికీ, ముఖ్యంగా మూడు రాశుల వారికి కెరీర్, వ్యాపారం, ఆర్థిక రంగాల్లో విశేషమైన అనుకూలతలు కల్పించనుంది.
సింహ రాశి
సింహ రాశి మొదటి స్థానంలోనే (లగ్న భావంలో) ఈ త్రిగ్రహ కలయిక ఏర్పడుతోంది. వృత్తిపరంగా విశేష పురోగతి లభిస్తుంది. ఉద్యోగులకు తమ సమర్థతను, నైపుణ్యాలను నిరూపించుకోవడానికి అద్భుతమైన వేదిక దొరుకుతుంది. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతులు లేదా వేతన పెంపు వంటి అనుకూల వార్తలు వింటారు. వ్యాపారస్తులకు నూతన ఒప్పందాలు లభించడంతో పాటు వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు తలుపు తడతాయి. అయితే, భాగస్వామ్యాలు లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడులకు సంబంధించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి అడుగువేయడం ఉత్తమం.
కర్కాటక రాశి
కర్కాటక రాశికి రెండవ స్థానంలో (ధన స్థానం) ఈ గ్రహాల ప్రభావం కొనసాగుతుంది. రాబడి మార్గాలు విస్తరిస్తాయి. సరైన ఆర్థిక ప్రణాళికతో ముందుకు సాగితే దీర్ఘకాలికంగా నిధులు సమకూరుతాయి. మెరుగైన ప్యాకేజీతో నూతన ఉద్యోగావకాశాలు లభించే ఆస్కారముంది. కార్యాలయంలో బాధ్యతలు పెరిగినప్పటికీ దానికి తగిన ఆర్థిక గుర్తింపు దక్కుతుంది. నిలిచిపోయిన బకాయిలు వసూలవుతాయి. నూతన ఆదాయ వనరులు తెరుచుకోవడం వల్ల వ్యాపారస్తుల ఆర్థిక స్థితి బలోపేతమవుతుంది.
మేష రాశి
మేష రాశి వారికి ఐదవ స్థానంలో (పంచమ భావం) ఈ త్రిగ్రహ కలయిక జరుగుతుంది. గతంలో చేసిన కృషికి ఇప్పుడు తగిన ప్రతిఫలం దక్కుతుంది. కార్యాలయంలో పై అధికారుల నుంచి ప్రశంసలతో పాటు కీలకమైన నూతన ప్రాజెక్టులు, బాధ్యతలు లభిస్తాయి. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు, నిరుద్యోగులు తమ ప్రతిభను చాటుకుని ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఇది సరైన సమయం. వ్యాపార విస్తరణకు సంబంధించి తీసుకునే వ్యూహాత్మక ఆలోచనలు లాభాలను తెచ్చిపెడతాయి. సంయమనంతో వ్యవహరిస్తే ఆర్థికంగా మరింత నిలకడ సాధించవచ్చు.

