Lord Venkateswara’s Temple: తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట నృత్యం చేస్తూ రీల్స్ చిత్రీకరించిన ఘటనపై టీటీడీ తక్షణమే స్పందించింది. ఆలయ పవిత్రతకు భంగం కలిగించేలా రీల్స్ చిత్రీకరించిన సదరు వ్యక్తులపై తిరుమల వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో టీటీడీ ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టనున్నారు.

ఘటన జరిగిన సమయంలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపైనా టీటీడీ చర్యలు తీసుకుంది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టినట్లు టీటీడీ వెల్లడించింది.

తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాలు, మాడ వీధుల్లో రీల్స్, వీడియోలు చిత్రీకరించడం పూర్తిగా నిషేధమని టీటీడీ మరోసారి స్పష్టం చేసింది. ఆలయ పవిత్రతకు భంగం కలిగించేలా ఎవరైనా వ్యవహరిస్తే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

తిరుమలకు వచ్చే భక్తులు ఆలయ పవిత్రతను కాపాడేందుకు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. శ్రీవారి ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడుతూ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరింది.

Next Story