Sri Kodandarama Swamy’s Pushpayagam: తిరుపతి శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 23వ తేదీ గురువారం నిర్వహించనున్న పుష్పయాగానికి బుధవారం సాయంత్రం శాస్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.

ఈ ఆలయంలో మార్చి 17 నుండి 25వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించబడిన విషయం తెలిసిందే. బ్రహ్మోత్సవాల సమయంలో అర్చకులు, అధికారులు, భక్తుల వల్ల తెలియక జరిగిన లోపాలకు ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం వల్ల సమస్త దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.

ఏప్రిల్ 23వ తేదీన పుష్పయాగం సందర్భంగా ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు స్వామివారు, అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 4.00 గంటల నుండి 6.00 గంటల వరకు సీతా లక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారికి వివిధ రకాల పుష్పాలతో అభిషేకం నిర్వహించబడుతుంది.

తదుపరి రాత్రి 7.00 గంటలకు శ్రీ సీతా రామ లక్ష్మణ స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తూ ఆశీర్వదిస్తారు.

ఈ పుష్పయాగంలో గృహస్తులు (ఇద్దరు) రూ.1,000/- చెల్లించి టికెట్ కొనుగోలు చేసి పాల్గొనవచ్చు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, టెంపుల్ ఇస్పెక్టర్లు శ్రీ సురేష్ బాబు, శ్రీ హరికృష్ణ, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story