Goddess Padmavathi: తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారికి రూ.3.78 లక్షల విలువైన అరుదైన వజ్రాభరణాలను బెంగళూరుకు చెందిన శ్రీమతి సి. పద్మజ, శ్రీ కె. రాఘవేంద్రరావు దంపతులు శనివారం ఆలయ అధికారులకు భక్తిశ్రద్ధలతో విరాళంగా అందజేశారు.

అన్‌కట్ వజ్రాలు, కెంపులు, పచ్చలతో అలంకరించిన ఒక జత స్టడ్స్‌ను అమ్మవారి సేవకు సమర్పించారు. అమ్మవారి అనుగ్రహం పొందాలనే భక్తిభావంతో ఈ ఆభరణాలను సమర్పించినట్లు దాతలు తెలిపారు.

మరోవైపు ఆదివరాహక్షేత్రమైన తిరుమలలోని శ్రీ భూ వరాహస్వామివారి ఆలయంలో ఆదివారం ఉదయం వరాహ జయంతి శాస్త్రోక్తంగా జరిగింది.

ఇందులో భాగంగా ఉదయం కలశస్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం చేప‌ట్టారు. అనంత‌రం వేద‌మంత్రాల న‌డుమ మూల‌వ‌ర్ల‌కు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, ప‌సుపు, చందనంతో విశేషంగా అభిషేకం నిర్వ‌హించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ అర్చకులు శ్రీ బాబు స్వామి, ఆలయ ఏఈవో శ్రీ దేవరాజులు, ఏవీఎస్‌వో శ్రీహరి రావు, సూపరింటెండెంట్ శ్రీ సురేష్, ఆలయ ఇన్‌స్పెక్టర్ శ్రీ చలపతి తదితరులు పాల్గొన్నారు.

Next Story