రామాయణానాకి ఏంటీ సంబంధం?

Sabarimala and the Ramayana: శబరిమల ఆలయం ఉన్న ప్రదేశానికి 'శబరిమల' అని పేరు రావడానికి కారణం రామాయణంలో ప్రస్తావించిన శబరి. రాముడు శబరిని సందర్శించి ఆమెకు మోక్షం ప్రసాదించిన ప్రదేశం ఇదేనని భక్తులు నమ్ముతారు. అయ్యప్ప స్వామి విష్ణువులోని మోహిని అంశకు, శివుడికి జన్మించారని పురాణాలు చెబుతాయి. అందుకే అయ్యప్పను 'హరిహర పుత్రుడు' అని పిలుస్తారు.శబరిమలకు వెళ్లే భక్తులు తప్పనిసరిగా 41 రోజుల పాటు కఠినమైన వ్రతం పాటించాలి. ఈ వ్రతంలో బ్రహ్మచర్యం పాటించడం, మద్యం, మాంసం తినకుండా ఉండటం, నల్ల దుస్తులు ధరించడం వంటి నియమాలు ఉంటాయి. ఆలయానికి చేరుకోవడానికి 18 పవిత్ర మెట్లు (పదినెట్టామ్ పడి) ఎక్కాలి. ఈ మెట్లు 18 దేవతలకు ప్రతీకగా భావిస్తారు. ఈ మెట్లపైకి ఇరుముడి లేనివారు వెళ్లడానికి అనుమతించరు. శబరిమలలో 10 నుంచి 50 సంవత్సరాల వయస్సు మధ్య ఉన్న మహిళలకు ప్రవేశం లేదు. అయ్యప్ప స్వామి నిత్య బ్రహ్మచారి కావడంతో ఈ నియమాన్ని పాటిస్తారు. అయితే, ఈ అంశంపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున ఆకాశంలో కనిపించే 'మకరజ్యోతి'ని చూడటానికి లక్షలాది మంది భక్తులు వస్తారు. ఈ జ్యోతిని అయ్యప్ప స్వామిని దర్శించుకున్నట్లుగా భావిస్తారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story