ఎపుడు వెలిగించాలి.?

Salt Lamp Meaning and Benefits: ఉప్పుతో ఐశ్వర్య దీపాన్ని వెలిగించడం అనేది మహాలక్ష్మి అనుగ్రహం కోసం చేసే ఒక ముఖ్యమైన పరిహారం (నివారణ). దీనిని సాధారణంగా శుక్రవారం రోజున చేస్తారు. ఇలా 11, 21 వారాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక సమస్యలు దూరమవుతాయని పండితులు సూచిస్తున్నారు. ‘ఉప్పులో దృష్టి దోషాలను పోగొట్టే శక్తి ఉంటుంది. ఇంట్లో పసిపిల్లలకు ఎలాంటి దోషం కలగకూడదంటే ఈ దీపం వెలిగించాలి’ అని చెబుతున్నారు. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రాల ప్రకారం ఈ దీపాన్ని వెలిగిస్తే కలిగే ప్రధాన ఫలితాల ఏంటి..ఉప్పు దీపాన్ని ఎలా వెలిగించాలో తెలుసుకుందాం

ఉప్పు దీపం వెలిగిస్తే కలిగే ఫలితాలు

ధనాకర్షణ: ప్రధానంగా ఐశ్వర్యం , సంపద ఆకర్షించబడతాయని, ఆర్థిక కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు.

ప్రతికూల శక్తి దూరం: ఉప్పుకు నెగటివ్ ఎనర్జీని (ప్రతికూల శక్తిని) గ్రహించి, పాజిటివ్ ఎనర్జీని (సానుకూల శక్తిని) ఆకర్షించే శక్తి ఉందని విశ్వసిస్తారు. దీనివల్ల ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు, చెడు ప్రభావాలు తొలగిపోతాయి.

అప్పుల నివారణ: అప్పుల సమస్యలతో బాధపడేవారికి ఈ దీపం ఉపశమనం కలిగిస్తుందని, వృధా ఖర్చులు తగ్గి సంపద చేతిలో నిలుస్తుందని పండితులు చెబుతారు.

వ్యాపార అభివృద్ధి: కొత్తగా వ్యాపారం ప్రారంభించిన వారికి లేదా వ్యాపారంలో నష్టాలు ఎదుర్కొంటున్న వారికి అభివృద్ధి, లాభాలు చేకూరుతాయి.

అఖండ ఐశ్వర్యం: నియమబద్ధంగా, భక్తిశ్రద్ధలతో ఈ దీపం వెలిగిస్తే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుందని ప్రగాఢ నమ్మకం.

దీపం వెలిగించే విధానం

రోజు: ముఖ్యంగా ప్రతి శుక్రవారం ఉదయం లేదా సాయంత్రం వెలిగిస్తారు.

ఉప్పు: రాళ్ళ ఉప్పు (సముద్రపు ఉప్పు) మాత్రమే ఉపయోగించాలి.

నూనె/నెయ్యి: ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వాడతారు.

దిక్కు: ఇంటికి ఈశాన్య మూలలో పెట్టడం శుభకరం.

స్త్రోత్ర పఠనం: దీపం వెలిగించేటప్పుడు కనకధారా స్తోత్రం లేదా లక్ష్మీదేవి స్త్రోత్రాలు పఠించడం వలన ఉత్తమ ఫలితాలు వస్తాయని చెబుతారు.

ముఖ్య గమనిక: ఈ దీపారాధన చేసిన తర్వాత, ప్రమిదలో ఉన్న ఉప్పును శనివారం లేదా ఆదివారం తీసివేసి, ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో లేదా ప్రవహించే నీటిలో (చెరువు, నది) లేదా ఇంట్లోని సింక్‌లో నీళ్లు తెరిచి పోయాలని సూచిస్తారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story