Sankata Mochana Hanuman Darshan: సంకట మోచన్ హనుమాన్ ను దర్శిస్తే శని దోషాలు పోతాయా?
శని దోషాలు పోతాయా?

Sankata Mochana Hanuman Darshan: ఉత్తర ప్రదేశ్ కాశీలోని (వారణాసి) సంకట మోచన్ హనుమాన్ ఆలయం. దేశంలోనే అత్యంత పవిత్రమైన హనుమాన్ ఆలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసి (కాశీ) నగరంలో, అస్సీ నది ఒడ్డున ,బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం (BHU) సమీపంలో ఉంది.ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో ప్రసిద్ధ హిందూ కవి, సాధువు అయిన శ్రీ గోస్వామి తులసీదాస్ స్థాపించారు.
సంకట మోచన్ హనుమాన్ . సంకటం అంటే కష్టం, మోచన్ అంటే విముక్తి కలిగించేవాడు. అంటే కష్టాలను తొలగించే హనుమంతుడు. ఈ హనుమంతుడిని దర్శిస్తే ఎలాంటి కష్టాలైనా, ముఖ్యంగా శని దోషాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.ఇక్కడ హనుమంతుడి విగ్రహం శ్రీరాముని వైపు చూస్తున్నట్లుగా ప్రతిష్ఠించబడి ఉంటుంది, ఇది ఇక్కడి ప్రత్యేకత.
సాధారణంగా ఉదయం 4:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు. మధ్యాహ్నం 3:00 గంటల నుండి రాత్రి 10:00 గంటల వరకు ఆలయం తెరుస్తారు. మంగళవారం, శనివారం అత్యంత రద్దీగా ఉండే రోజులు. ఈ రోజుల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. హనుమంతుడికి ఇష్టమైన బేసన్ లడ్డూలు,తులసి మాలలను భక్తులు సమర్పిస్తారు.

