ఆ 40 రోజులు జాగ్రత్తగా ఉండాల్సిందేనా?

Saturn Combustion Period: ఖగోళ మండలంలో కీలక మార్పు చోటుచేసుకోబోతోంది. నవగ్రహాలలో న్యాయమూర్తిగా, కర్మ కారకుడిగా భావించే శని దేవుడు బలహీనపడబోతున్నాడు. సూర్యుడికి అత్యంత సమీపంలోకి రావడం వల్ల శని తన పూర్తి శక్తిని కోల్పోయే ఈ స్థితిని జ్యోతిష్య పరిభాషలో అస్తమయం' అని పిలుస్తారు.

ఎప్పటి నుండి ఎప్పటి వరకు?

మీన రాశిలో శని గ్రహం బలహీనంగా ఉండే ఈ కాలం దాదాపు 40 రోజుల పాటు కొనసాగనుంది.

ప్రారంభం: మార్చి 13, సాయంత్రం 7:13 గంటలకు..

ముగింపు: ఏప్రిల్ 22, ఉదయం 4:43 గంటలకు.

శని బలహీనపడటం అంటే ఏమిటి?

సాధారణంగా ఏదైనా గ్రహం సూర్యుడి నుండి 15 డిగ్రీల లోపలికి వచ్చినప్పుడు అది తన ప్రభావాన్ని కోల్పోయి బలహీనపడుతుంది. బృహస్పతి , శుక్ర గ్రహాలు బలహీనపడినప్పుడు మనం శుభకార్యాలు ఎలాగైతే వాయిదా వేస్తామో, శని బలహీనపడినప్పుడు కూడా కొన్ని ప్రత్యేక ప్రభావాలు ఉంటాయని వివరించారు.

సమాజంపై చూపే ప్రభావం:

క్రమశిక్షణ, పట్టుదల, కఠిన శ్రమకు ప్రతీక అయిన శని ప్రభావం తగ్గడం వల్ల ఈ క్రింది రంగాలలో మార్పులు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు.

అశాంతి: కొన్ని ప్రాంతాలలో ప్రజల మధ్య అశాంతి నెలకొనే సూచనలు ఉన్నాయి.

క్రమశిక్షణ: క్రమశిక్షణకు మారుపేరైన పోలీసు, సైన్యం వంటి విభాగాలతో పాటు ప్రజా జీవితంలో కూడా క్రమశిక్షణపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సిన అవసరం ఏర్పడుతుంది.

పనితీరు: పట్టుదల తగ్గకుండా చూసుకోవడం ఈ సమయంలో చాలా ముఖ్యం.

ఏం చేయాలి?

శని ప్రభావం తగ్గిన ఈ 40 రోజుల కాలంలో వ్యక్తులు తమ పనుల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని, సోమరితనానికి చోటు ఇవ్వకుండా క్రమశిక్షణతో వ్యవహరించాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. శని ప్రభావం వల్ల కలిగే ప్రతికూలతలను అధిగమించడానికి తగిన ఆధ్యాత్మిక పరిహారాలు పాటించడం శ్రేయస్కరం.

PolitEnt Media

PolitEnt Media

Next Story