Saturn Enters Its Own Nakshatra on October 9: జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలలోకెల్లా శనీశ్వరుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. నెమ్మదిగా కదిలే స్వభావం ఉండటం వల్ల ఒక వ్యక్తి జీవితంపై శని ప్రభావం సుదీర్ఘ కాలం, లోతుగా కొనసాగుతుంది. ప్రస్తుతం మీనరాశిలోని రేవతి నక్షత్రంలో సంచరిస్తున్న శని దేవుడు.. అక్టోబర్ 9న మరో కీలక అడుగు వేయబోతున్నాడు. అక్టోబర్ 9వ తేదీన శని తన సొంత నక్షత్రమైన ఉత్తరాభాద్రలోకి ప్రవేశించనున్నాడు. ఈ నక్షత్రానికి అధిపతి సాక్షాత్తూ శనీశ్వరుడే కావడం విశేషం. 2027 ఫిబ్రవరి 8 వరకు శని ఇదే నక్షత్రంలో కొనసాగుతాడు. గ్రహాధిపతి తన సొంత నక్షత్రంలోకి ప్రవేశించడం జ్యోతిష్య రీత్యా అత్యంత బలమైన, శుభప్రదమైన పరిణామంగా పరిగణిస్తారు. ఈ నక్షత్ర మార్పు ప్రభావం మొత్తం 12 రాశులపై ఉన్నప్పటికీ.. ముఖ్యంగా మూడు రాశుల వారికి తిరుగులేని రాజయోగాన్ని, ఆర్థిక పరిపుష్టిని తెచ్చిపెట్టనుంది. ఆ అదృష్ట రాశులేవో చూద్దాం..

వృషభ రాశి – ఊహించని ఆర్థిక లాభాలు, స్థిరాస్తుల వృద్ధి

వృషభ రాశి వారికి శని నక్షత్ర మార్పు అన్ని విధాలా అనుకూలించనుంది. ఆకస్మిక ధనలాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. భౌతిక సౌకర్యాలు, విలాసాలు పెరుగుతాయి. కొత్త ఆదాయ మార్గాలు తెరచుకుని ఆర్థిక పునాది మరింత పటిష్టమవుతుంది. గతంలో ఆగిపోయిన పనులు, ప్రాజెక్టులు తిరిగి వేగవంతమై పూర్తవుతాయి. నిరుద్యోగులు కలలుగన్న ఉద్యోగాన్ని సాధిస్తారు. వ్యాపారస్తులకు భారీ లాభాలను అందించే సరికొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. మీ శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది.

మకర రాశి – పరపతి పెంపు, వ్యాపార విస్తరణ

శని అధిపతిగా గల మకర రాశి వారికి ఈ సంచారం అడుగడుగునా విజయాన్ని అందిస్తుంది. సమాజంలో ప్రముఖులు, పలుకుబడి గల వ్యక్తులతో సంబంధాలు బలపడతాయి. మీ మాటకు విలువ, పరపతి రెండూ పెరుగుతాయి. ఏ పని తలపెట్టినా కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారం లభిస్తుంది. వ్యాపారాన్ని విస్తరించాలనుకునే వారి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ధన ప్రవాహం పెరిగి రుణాల బాధలు తీరుతాయి.

కుంభ రాశి - శ్రమకు తగ్గ ఫలితం, ప్రేమ వివాహ యోగం

కుంభ రాశి జాతకులకు ఈ కాలం అదృష్టాన్ని ప్రకాశింపజేస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ నైపుణ్యాన్ని నిరూపించుకోవడానికి అద్భుతమైన అవకాశాలు వస్తాయి. మీరు సుదీర్ఘకాలంగా పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం, ప్రమోషన్లు దక్కే సమయమిది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ప్రేమించిన వ్యక్తితో వివాహం చేసుకోవాలనుకునే వారి కోరికలు నెరవేరే సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో నిలకడైన లాభాలు సమకూరుతాయి.

Next Story