ఈ పరిహారాలు పాటిస్తే అన్ని శుభాలే..

Saturn's Influence: జ్యోతిషశాస్త్రం ప్రకారం.. శని గ్రహాన్ని కర్మ అధిపతిగా భావిస్తారు. శని అనుగ్రహం ఉన్నవారికి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. నిరాడంబరత, నిజాయితీ, వినయం వంటి మంచి లక్షణాలు ఉన్నవారికి శని శుభ ఫలితాలను ఇస్తాడు. అయితే ప్రస్తుతం శని ప్రభావంతో కొన్ని రాశుల వారు ఇబ్బందులు పడుతున్నారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రభావాలను తగ్గించుకోవడానికి కొన్ని ప్రత్యేక పరిహారాలను సూచిస్తున్నారు.

శని ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న రాశులు, నివారణలు :

ప్రస్తుతం శని ప్రభావంతో మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం, మీన రాశి వారు వివిధ సమస్యలను ఎదుర్కొంటున్నారని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ రాశుల వారు పాటించాల్సిన పరిహారాలు ఇక్కడ ఉన్నాయి:

మేష రాశి

శని సంచారం వల్ల మేష రాశి వారు అనారోగ్య సమస్యలు, అనవసరమైన ఖర్చులు, ధన నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. పురోగతికి ఆటంకాలు ఏర్పడతాయి.

పరిహారం: శని చుట్టూ ప్రదక్షిణలు చేయడం. అప్పుడప్పుడు శివుడిని పూజించడం మంచిది.

మిథున రాశి

మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాలలో సమస్యలు ఎదురవుతాయి. బదిలీలు, పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.

పరిహారం: ఈ ప్రభావాలను తగ్గించుకోవడానికి తరచుగా శివాలయాలను సందర్శించి పూజలు చేయాలి.

సింహ రాశి

సింహ రాశి వారికి 'అష్టమ శని' ప్రభావం ఉంటుంది. దీని వల్ల అన్ని పనులు ఆలస్యమవుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పెరుగుతాయి.

పరిహారం: శివపూజ చేయడంతో పాటు, నువ్వులు, జొన్నలను దానం చేయడం ద్వారా శని ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు.

కన్య రాశి

కన్య రాశి వారికి వృత్తిలో పురోగతికి ఆటంకాలు, కుటుంబ సమస్యలు, ప్రేమ వ్యవహారాలలో అపార్థాలు ఏర్పడతాయి.

పరిహారం: శని ప్రదక్షిణలు చేయడం ద్వారా ఈ సమస్యల నుండి బయటపడవచ్చు.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి కుటుంబంలో శాంతి లోపించడం, ఆస్తి వివాదాలు, తల్లి ఆరోగ్యం సమస్యగా మారే అవకాశం ఉంది.

పరిహారం: మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి శివ భజనలు చేయడం , శనికి దీపం వెలిగించడం మంచిది.

కుంభ రాశి

కుంభ రాశి వారు ఎంత కష్టపడినా ఆశించిన ఆదాయం లభించకపోవచ్చు. ఆర్థిక లావాదేవీల వల్ల సమస్యలు ఎదురవుతాయి.

పరిహారం: తరచుగా తలకు కండువా ధరించడం, నల్లని దుస్తులు ధరించడం శని ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

మీన రాశి

మీన రాశి వారికి ఆరోగ్య సమస్యలు, అనవసరమైన ఖర్చులు, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వంటివి జరుగుతాయి.

పరిహారం: శివుడిని క్రమం తప్పకుండా పూజించడంతో పాటు నల్లని దుస్తులు ఎక్కువగా ధరించడం వల్ల ఈ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story