Sri Govindaraja Swamy Temple: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై 02వ తేదీ బుధవారం జ‌రుగ‌నున్న పుష్పయాగానికి మంగళవారం సాయంత్రం 5.30 – 8.30 గం.ల మధ్య సేనాధిప‌తి ఉత్స‌వం, శాస్ర్తోక్తంగా అంకురార్ప‌ణ నిర్వ‌హించారు. ఇందులో భాగంగా శ్రీ విష్వ‌క్సేనులవారు ఆల‌య మాడ వీధుల్లో విహ‌రించారు. ఆ త‌రువాత అంకురార్పణ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు సతీసమేత శ్రీ గోవిందరాజస్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 4 గంటల వరకు వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పలురకాల పుష్పాలు, ప‌త్రాల‌తో శ్రీదేవి , భూదేవి సమేత స్వామివారికి అభిషేకం చేస్తారు. అనంతరం సాయంత్రం 6 – 7.30 గం.ల వరకు స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను ఆశీర్వదించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ ముని కృష్ణారెడ్డి, ఇతర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. మరోవైపు తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య నానాటికి పెరుగుతుంది. జూన్ లో భక్తుల రద్దీ బాగా పెరిగిపోయింది. ఈ నెలలో 24 లక్షల మంది స్వామి వారిని దర్శించుకున్నారు. సగటున రోజుకు 80 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు. ఆదాయం రూ. 119 కోట్లు వచ్చింది. మే నెలలో రూ. 106కోట్లు వచ్చిందని టీటీడీ తెలిపింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story