మోపిదేవి ఆలయం ఈ విషయాలు తెలుసా?

The Mystery of Mopidevi Temple: శ్రీ బాల సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం ఈ ఆలయం కృష్ణా జిల్లా, మోపిదేవి మండలం, మోపిదేవి గ్రామంలో ఉంది.ఇది తెలుగురాష్ట్రాలలో ప్రసిద్ధ సుబ్రహ్మణ్వేశ్వర స్వామి దేవాలయం.ప్రతిరోజు ఇతర ప్రాంతాల నుండి భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నుండి దాదాపు 70 కి.మీ.ల దూరంలో ఉంది.

ఇక్కడి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహం స్వయంభువుగా వెలసిందని భక్తులు విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం, వీరారపు పర్వతాలు అనే ఒక కుమ్మరి భక్తుడి కలలో స్వామి కనిపించి, తాను పుట్టలో ఉన్నానని చెప్పగా, ఆ స్థలంలో తవ్వగా ఈ విగ్రహం లభించింది.

పురాణ కథనం ప్రకారం, ఒకసారి సుబ్రహ్మణ్యేశ్వరుడు చిన్నతనంలో అమాయకంగా నవ్వడం వల్ల పార్వతీదేవి కోపానికి గురయ్యాడు. ఆ దోషం పోగొట్టుకోవడానికి నాగ రూపంలో ఇక్కడ తపస్సు చేశాడని చెబుతారు. అందుకే ఈ ఆలయం నాగదోష నివారణకు ప్రసిద్ధి చెందింది.

ఈ ఆలయంలో గర్భగుడిలో ఆరేడు సర్పాల చుట్టలపై శివలింగం ఉంటుంది. దీనినే పానవట్టం అని పిలుస్తారు. దీని కింద ఉన్న రంధ్రం ద్వారానే అభిషేకం చేస్తారు. ఈ విధంగా శివుడు, సుబ్రహ్మణ్యుడు ఒకే చోట కొలువై ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత.

సర్పదోషం, రాహు-కేతు దోషాలు, వివాహం ఆలస్యం అవుతున్నవారు, సంతానం లేనివారు ఇక్కడ ప్రత్యేక పూజలు చేయించుకుంటే ఆ దోషాలు నివారణ అవుతాయని భక్తుల నమ్మకం. నాగులచవితి రోజున ఈ ఆలయానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఇక్కడ ఉన్న పుట్టకు పాలు పోసి, పుట్టమన్నును ప్రసాదంగా తీసుకువెళ్తారు. పుట్టమన్నును ధరించడం వల్ల వ్యాధులు నయమవుతాయని, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని విశ్వసిస్తారు.

ఈ ఆలయానికి సుమారు ఐదు శతాబ్దాల చరిత్ర ఉందని చెబుతారు. దీని ప్రస్తావన స్కంద పురాణంలో కూడా కనిపిస్తుంది. చల్లపల్లి జమీందారులు, దేవరకోట సంస్థానాధీశులు ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story