Women Avoid Cremation Grounds: స్త్రీలు శ్మశానానికి వెళ్లకూడదా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
గరుడ పురాణం ఏం చెబుతోంది?

Women Avoid Cremation Grounds: హిందూ సంప్రదాయంలో మనిషి పుట్టుక నుంచి మరణం వరకు ప్రతి దశలోనూ కొన్ని ప్రత్యేక సంస్కారాలు ఉన్నాయి. ఇందులో ఆఖరిది 'అంత్యక్రియలు'. సాధారణంగా అంత్యక్రియల సమయంలో పురుషులు మాత్రమే శ్మశానానికి వెళ్తుంటారు, స్త్రీలను అనుమతించరు. అయితే, మహిళలు శ్మశాన వాటికకు ఎందుకు వెళ్లకూడదో గరుడ పురాణం ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
శాస్త్రాల ప్రకారం, మహిళల మనస్సు పురుషుల కంటే చాలా సున్నితమైనది. శ్మశానంలో శవాన్ని దహనం చేసే దృశ్యం భయంకరంగా ఉంటుంది. ఆ దృశ్యాన్ని చూసి మహిళలు మానసిక ఆందోళనకు గురయ్యే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, వారు కన్నీరు మున్నీరుగా ఏడ్వడం వల్ల మరణించిన వ్యక్తి ఆత్మకు శాంతి కలగదని, ఆ ఆత్మ మమకారాన్ని వదులుకోలేక ఇబ్బంది పడుతుందని నమ్ముతారు.
గరుడ పురాణం ప్రకారం, శ్మశాన వాటిక ప్రతికూల శక్తులకు, క్షుద్ర శక్తులకు నిలయం. మహిళలు శారీరకపరంగా, మానసికపరంగా కొంత సున్నితంగా ఉంటారు కాబట్టి, ఈ ప్రతికూల శక్తులు వారిని త్వరగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు,అవివాహిత యువతులకు ఇలాంటి ప్రదేశాలు శ్రేయస్కరం కావని పెద్దలు చెబుతుంటారు.
హిందూ ధర్మం ప్రకారం, అంత్యక్రియలకు వెళ్లేవారు తలనీలాలు సమర్పించాల్సి ఉంటుంది. మహిళలు తమ జుట్టును కత్తిరించుకోవడాన్ని అశుభంగా భావిస్తారు. అందుకే వారిని శ్మశానానికి దూరంగా ఉంచుతారు. వీటన్నింటితో పాటు, శ్మశానం నుంచి తిరిగి వచ్చాక ఇంటిని శుభ్రం చేయడం, స్నానాలు చేయడం వంటి పనుల కోసం మహిళలు ఇంట్లోనే ఉండటం ఒక సంప్రదాయంగా వస్తోంది.
కాలం మారుతున్న కొద్దీ కొందరు ఈ సంప్రదాయాలను సడలిస్తున్నప్పటికీ, శాస్త్రోక్తంగా, ఆరోగ్యపరంగా మహిళల క్షేమం కోసమే మన పూర్వీకులు ఈ నియమాన్ని పెట్టారు.

