Shravana Month Special: శ్రావణ మాసం వచ్చిందంటే చాలు.. ఇళ్లన్నీ పూజలు, నోములు, అమ్మవారి కళతో కళకళలాడిపోతుంటాయి. అయితే, ఆఫీసులు, పనులతో బిజీగా ఉండే వర్కింగ్ ఉమెన్స్‌కి ప్రసాదాలు చేయడం ఒక పెద్ద టాస్క్‌లా అనిపిస్తుంటుంది. ఓ పక్క సెలవు దొరక్క, మరోపక్క ఆచారాలు పాటించలేక పడే టెన్షన్ అంతా ఇంతా కాదు. మీకోసమే ఈ సింపుల్ టిప్స్.జస్ట్ పదే పది నిమిషాల్లో ఎంతో రుచికరమైన ప్రసాదాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా నోరూరించే 'శెనగపప్పు పాయసం' తయారీకి కావలసినవి: ముప్పావు కప్పు శెనగపప్పు, ముప్పావు కప్పు పాలు, ఒక కప్పు బెల్లం తురుము, కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్, రెండు స్పూన్ల నెయ్యి. తయారీ విధానం: ముందుగా శెనగపప్పును దోరగా వేయించి, కుక్కర్‌లో నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఆ తర్వాత పప్పును కచ్చాపచ్చాగా రుబ్బి, కరిగించిన బెల్లం పాకంలో కలపాలి. చివరగా యాలకుల పొడి, నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేస్తే చాలు.. గుమగుమలాడే శెనగపప్పు పాయసం రెడీ!

ఇక రెండోది అమ్మవారికి ఎంతో ఇష్టమైన 'బెల్లం అన్నం'. దీనికోసం ఒక కప్పు బియ్యం, అరకప్పు పెసరపప్పును అరగంట పాటు నానబెట్టి కుక్కర్‌లో మెత్తగా ఉడికించాలి. ఇప్పుడు సన్నటి మంటపై ఉడికించిన అన్నం మిశ్రమంలో తురిమిన బెల్లం, యాలకుల పొడి కలపాలి. బెల్లం కరిగిన తర్వాత ఒక కప్పు కాచిన పాలు పోసి దగ్గరగా అయ్యే వరకు ఉడికించాలి. చివరగా నెయ్యిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్‌లతో గార్నిష్ చేస్తే.. నోట్లో వెన్నలా కరిగిపోయే బెల్లం అన్నం రెడీ అవుతుంది.

సమయం లేదనే టెన్షన్ లేకుండా, కేవలం పది నిమిషాల్లోనే ఈ వెరైటీ ప్రసాదాలను తయారు చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించవచ్చు! ఈ ప్రసాదాలను దేవునికి పెట్టి, చుట్టుపక్కల వారికి పంచిపెడితే సిరిసంపదలు వృద్ధి చెందుతాయని పండితులు చెబుతున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story