Somvati Amavasya Today (June 15): హిందూ సంప్రదాయంలో ప్రతి రోజుకూ ఒక ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా... అమావాస్య, సోమవారం... ఈ రెండూ కలిసి వచ్చాయంటే ఆ రోజు విశిష్టత అంతా ఇంతా కాదు. అలాంటి ఒక అత్యంత పవిత్రమైన రోజే... ఈ ఏడాది జూన్ 15న వచ్చిన "సోమవతి అమావాస్య". సోమవారం అంటేనే ఆ పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఈ రోజున శివాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తారు. అయితే... ఈ పవిత్రమైన రోజున వివాహిత మహిళలు తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలని, కొన్ని పనులకు అస్సలు చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి.మరి ఆ నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం...

మహిళలు చేయవలసిన పనులు:

అమావాస్య రోజున తెల్లవారుజామునే నిద్రలేచి, కాలకృత్యాలు ముగించుకుని, సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించాలి.

పూజా గదిలో నువ్వుల నూనెతో దీపారాధన చేసి... శివాలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకోవాలి. సాధ్యమైనంత వరకు ఉపవాస దీక్షను పాటించడం మంచిది.

ఈ రోజున ఎవరినీ కించపరిచేలా మాట్లాడకూడదు. వీలైతే కొంత సమయం పాటు ‘మౌనవ్రతం’ పాటించడం వల్ల అమితమైన పుణ్యఫలం లభిస్తుంది.

అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించకపోవడం దరిద్ర హేతువు అంటారు. అందుకే ఈ రోజున సాయంత్రం వేళ లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజించాలి.

మహిళలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని పనులు:

సోమవతి అమావాస్య రోజున స్త్రీలు ఇంద్రియ నిగ్రహాన్ని పాటించాలి. దంపతులు ఖచ్చితంగా బ్రహ్మచర్యం అవలంబించాలి.

ఒకవేళ ఆరోగ్య కారణాల వల్ల ఉపవాసం ఉండలేని వారు... సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం ముట్టకూడదు. అలాగే ఇంట్లోని పురుషులు మద్యం, సిగరెట్, జరదా వంటి వ్యసనాలకు దూరంగా ఉండేలా చూసుకోవాలి.

ఈ రోజున గోళ్లు కత్తిరించుకోకూడదు. అలాగే తల దువ్వుకోకుండా జుట్టును అలాగే అల్లేసుకోవాలి.

అతి ముఖ్యమైన నియమం... అమావాస్య రోజున, ముఖ్యంగా సాయంత్రం వేళల్లో పసిపిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు తీసుకురాకూడదు.

ఈ సోమవతి అమావాస్య రోజున పరమశివునికి బిల్వ పత్రాలతో అభిషేకం చేసి, లక్ష్మీదేవిని పూజిస్తే... మీ జీవితంలో దీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story