శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

Special Festivals at Sri Govindaraja Swamy Temple: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జ‌న‌వ‌రి నెల‌లో జరుగనున్న విశేష ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.

–జ‌న‌వ‌రి 1న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థసారధి స్వామి వారు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు.

– జ‌న‌వ‌రి 2, 23వ తేదీల్లో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారు ఆలయ మాడ వీధుల్లో భక్తులను అనుగ్రహిస్తారు.

– జ‌న‌వ‌రి 3న పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌

– జ‌న‌వ‌రి 5న శ్రీ గోవింద‌రాజ‌స్వామివారు రామ‌చంద్ర‌తీర్థ క‌ట్ట‌కు వేంచేపు.

– జ‌న‌వ‌రి 7 నుండి 13వ తేదీ వ‌ర‌కు శ్రీ ఆండాల్‌ అమ్మవారి నీరాటోత్సవం.

– జ‌న‌వ‌రి 14న భోగి తేరు.

– జ‌న‌వ‌రి 15న మ‌క‌ర సంక్రాంతి.

– జ‌న‌వ‌రి 16న గోదా క‌ల్యాణం

– జ‌న‌వ‌రి 17న క‌నుమ పండుగ సంద‌ర్భంగా పార్వేటి ఉత్స‌వం.

– జ‌న‌వ‌రి 18 నుండి ఫిబ్ర‌వ‌రి 10వ తేదీ వ‌ర‌కు అధ్యయనోత్సవాలు

–జ‌న‌వ‌రి 20న శ్ర‌వ‌ణా నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి నాలుగు మాడ వీధుల్లో భక్తులను అనుగ్రహిస్తారు.

– జ‌న‌వ‌రి 25న ర‌థ‌స‌ప్త‌మి.

– జ‌న‌వ‌రి 27 నుండి ఫిబ్ర‌వ‌రి 1వ తేదీ వ‌ర‌కు తెప్పోత్స‌వాలు.

PolitEnt Media

PolitEnt Media

Next Story