కార్తీకమాస విశేష పూజ హోమ మహోత్సవాలు

Sri Kapileswara Temple: పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని లోక కల్యాణం కోసం తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబ‌రు 22 నుంచి న‌వంబరు 20వ తేదీ వరకు నెల రోజుల పాటు విశేషపూజ హోమ మహోత్సవాలు జరుగనున్నాయి. అక్టోబరు 22వ తేదీన హోమ మహోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరుగనుంది. అక్టోబ‌రు 22 నుంచి 23వ తేదీ వరకు మొదటగా శ్రీగణపతిస్వామివారి హోమం, అక్టోబ‌రు 24 నుండి 26వ‌ తేదీ వ‌ర‌కు శ్రీసుబ్రమణ్యస్వామివారి హోమం, అక్టోబ‌రు 27న శ్రీదక్షిణామూర్తి స్వామివారి హోమం, అక్టోబ‌రు 28న శ్రీ నవగ్రహ హోమం జరుగనున్నాయి. అదేవిధంగా అక్టోబరు 29న శ్రీకాలభైరవ స్వామివారి హోమం, అక్టోబరు 30 నుంచి న‌వంబ‌రు 7వ తేదీ వరకు శ్రీ కామాక్షి అమ్మవారి హోమం(చండీహోమం), న‌వంబరు 8 నుంచి 18వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వర స్వామివారి హోమం(రుద్రహోమం), న‌వంబ‌రు 19న ధ‌ర్మ‌శాస్త్ర హోమం, న‌వంబ‌రు 20న శ్రీచండికేశ్వరస్వామివారి హోమం, త్రిశూలస్నానం, పంచమూర్తుల తిరువీధి ఉత్సవం నిర్వహించనున్నారు. గృహస్తులు (ఇద్దరు) రూ.500/- చెల్లించి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు. ఈ హోమాల్లో పాల్గొనే గృహస్తులు కచ్చితంగా సంప్రదాయ వస్త్రధారణలో రావాల్సి ఉంటుంది. ఈ హోమాల్లో భాగంగా అక్టోబరు 27న శ్రీ వళ్లి దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్యస్వామివారి కల్యాణం, నవంబరు 18న మాస శివరాత్రి నాడు శ్రీ శివపార్వతుల కల్యాణోత్సవం జరుగనున్నాయి. గృహస్తులు (ఇద్దరు) రూ.500/- చెల్లించి ఒక్కో కల్యాణంలో పాల్గొనవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story