Sri Govindaraja Swamy Temple: శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా శ్రీ చక్రత్తాళ్వార్ సాత్తుమొర
శ్రీ చక్రత్తాళ్వార్ సాత్తుమొర

Sri Govindaraja Swamy Temple: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బుధవారం శ్రీ చక్రత్తాళ్వార్ సాత్తుమొర, శ్రీ ప్రతివాది భయంకరన్ అన్నన్ సాత్తుమొర వేడుకలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీనారాయణస్వామివారి ఆలయం నుంచి ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు ఉభయ నాంచారులతో కూడిన శ్రీ వరదరాజస్వామివారు, శ్రీ ప్రతివాది భయంకరన్ అన్నన్ స్వామివార్లను ఆలయ నాలుగు మాడ వీధుల్లో మంగళవాయిద్యాల నడుమ ఊరేగించి భక్తులకు దర్శనమిచ్చారు.
అనంతరం ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తీసుకొచ్చిన అప్పపడి ప్రసాదాన్ని శ్రీకోదండరామాలయం నుంచి శ్రీ లక్ష్మీనారాయణస్వామివారి ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చి సాత్తుమొర నిర్వహించారు.
సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ చక్రత్తాళ్వార్ స్వామివార్లను ఆలయ నాలుగు మాడ వీధుల్లో వైభవంగా ఊరేగించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
అనంతరం శ్రీ ఆండాళ్ అమ్మవారి ఊరేగింపు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్. శాంతి, ఏఈవో శ్రీ ఏ బీ నారాయణ చౌదరి, సూపరింటెండెంట్ శ్రీ చిరంజీవి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ధనంజయ, ఆలయ అర్చకులు, సిబ్బంది, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
- SriChakrathalwarChakrathalwarSattumoraGovindarajaSwamyTempleGovindarajaSwamyTirupatiTTDTirupatiTempleTempleNewsDevotionalNewsSpiritualNewsHinduTemplesVaishnavismSriVaishnavaBhaktiSattumoraPrativadiBhayankaramAnnanAndhraPradeshTirupatiNewsReligiousNewsLatestDevotionalNewsLatestSpiritualNewsLatestTeluguNewsTeluguNewsBreakingNewsLatestNews

