Sri Govindaraja Swamy’s Divine: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం బ్రహ్మోత్సవాల్లో ఏడవ రోజైన శుక్రవారం రాత్రి శ్రీ గోవిందరాజస్వామివారు దర్బార్ కృష్ణుడి అలంకారంలో చంద్రప్రభ వాహనంపై భక్తులకు కనువిందు చేశారు. చంద్రబింబంలా ప్రకాశించిన వాహనంపై స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించిన భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ఔషధాలకు అధిపతియైన చంద్రుడు సమస్త జీవజాతికి పోషకుడిగా నిలుస్తాడు. రసస్వరూపుడైన చంద్రభగవానుడు ఔషధులను పోషించి జగత్తుకు జీవాధారంగా నిలుస్తున్నాడు. చంద్రుని కిరణాలు చల్లదనాన్ని, ప్రశాంతతను, ఆనందాన్ని ప్రసాదిస్తాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. అందుకే స్వామివారు చంద్రప్రభ వాహనంపై విహరిస్తూ భక్తులకు ఆహ్లాదాన్ని పంచారు. కాగా శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత వైభవోపేతమైన రథోత్సవం మే 30న శనివారం ఉదయం 5.40 గం.లకు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ నారాయణ చౌదరి, సూపరింటెండెంట్ శ్రీ చిరంజీవి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ధనంజయ, అర్చకులు, అధికారులు , విశేష సంఖ్యలో భక్తులు, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story