Sri Kalyana Venkateswara Swamy: నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం సాయంత్రం జరిగిన ధ్వజావరోహణ మహోత్సవంతో శాస్త్రోక్తంగా ముగిశాయి.

బ్రహ్మోత్సవాల ఆరంభంలో ధ్వజారోహణం ద్వారా ఆహ్వానించిన సకల దేవతలను, గరుడ పటాన్ని అవనతం చేసి సంప్రదాయబద్ధంగా సాగనంపారు. వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ నిర్వహించిన ఈ పుణ్యకార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తింది.

తొమ్మిది రోజుల పాటు వివిధ వాహన సేవలు, ఉత్సవాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో భక్తులకు దివ్యానుభూతిని ప్రసాదించిన స్వామివారి బ్రహ్మోత్సవాలు ధ్వజావరోహణంతో పూర్ణాహుతి పొందాయి.

ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ నాగరాజు, ఆలయ అర్చకులు మరియు అధికారులు పాల్గొన్నారు.

Next Story