Sri Kapileshwaraswamy Temple: శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో సుబ్రమణ్యస్వామివారి హోమం ప్రారంభం
సుబ్రమణ్యస్వామివారి హోమం ప్రారంభం

Sri Kapileshwaraswamy Temple: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శుక్రవారం ఉదయం శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం ప్రారంభమైంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు ఏకాంతంగా హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ రోజు నుండి 26వ తేదీ వరకు మూడు రోజుల పాటు సుబ్రమణ్యస్వామి వారి హోమం జరుగనుంది. ఇందులో భాగంగా యాగశాలలో శుక్రవారం ఉదయం పూజ, హోమం, లఘుపూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం హోమం, సహస్రనామార్చన, విశేష దీపారాధన నిర్వహించనున్నారు. కాగా ఈ నెల 27వ తేదీ శ్రీ దక్షిణ మూర్తి స్వామి వారి హోమం జరుగనుంది. అనంతరం సాయంత్రం 5.30 గంటలకు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్య స్వామివారి దివ్యకల్యాణ మహోత్సవం జరుగనుంది. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్ ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.

