Sri Kapileswara Swamy Temple: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 26 నుంచి 28వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకు ముందుగా జూలై 25న సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ నిర్వహించి ఉత్సవాలకు శ్రీకారం చుడతారు.

ఆలయ పవిత్రత పరిరక్షణకే పవిత్రోత్సవాలు ఏడాది పొడవునా ఆలయంలో జరిగే నిత్యార్చనలు, ఉత్సవాలు, కైంకర్యాల్లో తెలియక సంభవించిన దోషాలకు పరిహారంగా, ఆలయ పవిత్రతను పరిరక్షించేందుకు శైవాగమ శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఉత్సవాల ద్వారా ఆలయంలో ఆధ్యాత్మిక శోభ మరింత వృద్ధి చెందుతుంది.

మూడు రోజుల విశేష కార్యక్రమాలు

జూలై 26 (మొదటి రోజు):

ఉదయం ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం కలశపూజ, హోమం, పవిత్ర ప్రతిష్ఠ జరుగుతుంది.

జూలై 27 (రెండో రోజు):

ఉదయం గ్రంథి పవిత్ర సమర్పణ, సాయంత్రం యాగశాల పూజ, హోమం నిర్వహిస్తారు.

జూలై 28 (మూడో రోజు):

ఉదయం మహాపూర్ణాహుతి, కలశోద్ధ్వాసన, పవిత్ర సమర్పణ నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు పంచమూర్తులైన శ్రీ కపిలేశ్వరస్వామివారు, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వరస్వామివారు, శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారు, శ్రీ చండికేశ్వరస్వామివారు ఆలయ పురవీధుల్లో భక్తులకు దివ్య దర్శనం ప్రసాదించనున్నారు.

భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి పవిత్రోత్సవాల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని టిటిడి కోరుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story