Endowments Department: అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం వెంగలపల్లె గ్రామం రాజనాలబండలోని శ్రీ ప్రసన్నఆంజనేయస్వామి, శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాలను బుధవారం టీటీడీ అధికారులు ప్రభుత్వ ఆదేశాల మేరకు దేవాదాయ ధర్మాదాయశాఖకు అధికారికంగా అప్పగించారు.

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఉదయం 10.30 గంటలకు తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ సముదాయాల ప్రత్యేకశ్రేణి డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్. శాంతి, మదనపల్లిలోని దేవాదాయ శాఖ అధికారి శ్రీ విశ్వనాథంకు రెండు ఆలయాల బాధ్యతలనుఅధికారికంగా అప్పగించారు.

టీటీడీ పరిధిలో ఉన్న ఈ రెండు ఆలయాలతో పాటు వాటికి సంబంధించిన ఆస్తులు, ఆభరణాలను ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సంబంధితదేవాదాయ శాఖకు అప్పగించే ప్రక్రియను నిబంధనల మేరకు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ సీఏవో శ్రీ వెంకటరమణ, టాస్క్‌ఫోర్స్ తహశీల్దార్ శ్రీమతి లలితాంజలి, శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ ఏఈవో శ్రీ ఏబీనారాయణ చౌదరి, సూపరింటెండెంట్ శ్రీమతి పద్మప్రియ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story