Sri Prasanna Venkateswara Swamy: అప్పలాయగుంటలో జరుగుతున్న శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు గజవాహనంపై దివ్యంగా విహరించి భక్తులకు అభయహస్తంతో అనుగ్రహించారు.

వాహనసేవ మార్గమంతా భక్తులు గోవింద నామస్మరణతో అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. మధ్యాహ్నం 3.00 నుండి 4.00 గంటల వరకు పుణ్యాహవాచనం, వసంతోత్సవం వైభవంగా నిర్వహించారు.

జూలై 1, బుధవారం ఉదయం 8.00 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఈ వాహనసేవలో టీటీడీ డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ వేణుగోపాల్, అర్చకులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story