Sri Soumyanatha Swamy: నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి క‌ల్కి అలంకారంలో అశ్వవాహనంపై స్వామివారు విహరించి భక్తులను అనుగ్రహించారు.

మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ కోలాహలంగా వాహనసేవ జరిగింది.

ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనాదిరూఢుడై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని నామ సంకీర్తనాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నాడు.

వాహ‌న సేవ‌లో ఆల‌య సూప‌రింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ దిలీప్, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

Next Story