✕
Sri Vedanarayana Swamy Temple: కల్పవృక్ష వాహనంపై పాండురంగ స్వామి అలంకారంలో శ్రీ వేదనారాయణ స్వామి అనుగ్రహం
By PolitEnt MediaPublished on
శ్రీ వేదనారాయణ స్వామి అనుగ్రహం

x
Sri Vedanarayana Swamy Temple: నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగవ రోజైన సోమవారం ఉదయం కల్పవృక్ష వాహనంపై పాండురంగ స్వామి అలంకారంలో స్వామివారు భక్తులను అనుగ్రహించారు.
వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తించగా, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
కల్పవృక్షం కోరుకున్న వరాలను ప్రసాదించే దివ్య వృక్షంగా పరిగణించబడుతుంది. దాని నీడలో ఆశ్రయించిన వారికి శాంతి, సంతృప్తి కలుగుతాయని ఆధ్యాత్మిక భావన.
ఈ వాహనసేవలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాసులు, చెంగల్రాయులు, ఆలయ అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

PolitEnt Media
Next Story
