శ్రీవారి ఆలయం మూత

Srivari Temple to Remain Closed: చంద్రగ్రహణం కారణంగా మార్చి 3వ తేదీ ఉదయం 9 నుండి సాయంత్రం 7.30 గంటల వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని సుమారు 10.30 గంటల పాటు మూసివేయనున్నారు. మార్చి 3వ తేదీ సాయంత్రం 3.20 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై 6.47 గంటలకు పూర్తవుతుంది. సాధారణంగా గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. సాయంత్రం 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు.

అనంతరం శ్రీవారి దర్శనం భక్తులకు 8:30గం నుండి పునః ప్రారంభవుతుంది. చంద్రగ్రహణం కారణంగా మార్చి 3వ‌ తేదీ మంగళవారం అష్టదళ పాద పద్మారాధన సేవను, కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్స‌వం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. వీటితో పాటు ఆరోజున వీఐపీ బ్రేక్ దర్శనాలు, శ్రీవాణి దర్శనాలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, చంటి పిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు, దివ్యాంగులు, దాతలు, ఎన్ఆర్ఐ దర్శనాలను కూడా రద్దు చేయడం జరిగింది.

గ్రహణం పూర్తయిన తర్వాత ఆలయ శుద్ధి (సంప్రోక్షణ) కార్యక్రమాలను అర్చకులు అత్యంత నిష్టగా నిర్వహిస్తారు. పుణ్యహవాచనం అనంతరం స్వామివారికి నైవేద్యం సమర్పించి, ఆపై భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఆలయం మూసి ఉన్న సమయంలో అన్నప్రసాద వితరణ కూడా నిలిపివేయబడుతుంది. అయితే, భక్తులకు ఇబ్బంది కలగకుండా గ్రహణం ముగిసిన వెంటనే అన్నప్రసాద భవనాలలో తిరిగి భోజన సౌకర్యాలు కల్పిస్తారు.

ఈ చంద్రగ్రహణం ప్రభావం కారణంగా తిరుమలలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆలయాలన్నీ మూసివేయబడతాయి. తిరుమలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, గ్రహణం రోజున కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించేలా టీటీడీ ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. దర్శనం కోసం ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకున్న వారు, వారి స్లాట్ సమయాలను ఒకసారి సరిచూసుకోవాలని టీటీడీ ఐటీ విభాగం స్పష్టం చేసింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story