Struggling with Peace and Finances at Hom: ఎంత కష్టపడినా గుర్తింపు రాకపోవడం.. సంపాదన ఉన్నా చేతిలో డబ్బు నిలవకపోవడం.. కారణం లేకుండానే ఇంట్లో గొడవలు జరగడం.. ఇలాంటి సమస్యలతో మీరు సతమతమవుతున్నారా? వాస్తు శాస్త్రం ప్రకారం.. మీ ఇంట్లో పేరుకుపోయిన ప్రతికూల శక్తే ఇందుకు కారణం కావచ్చు. అయితే, మన వంటగదిలో ఉండే చింతపండు కేవలం రుచికే కాదు, ఇలాంటి వాస్తు దోషాలను తొలగించడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుందని పురాతన నమ్మకం.

ప్రతికూలతను తరిమికొట్టే చింతపండు చిట్కా

మీ ఇంట్లో వాతావరణం ఎప్పుడూ ఒత్తిడిగా, అశాంతిగా అనిపిస్తుంటే ఈ చిన్న పని చేసి చూడండి..

ఒక గుప్పెడు చింతపండు గింజలను తీసుకుని రాత్రంతా నీటిలో నానబెట్టండి.

మరుసటి రోజు ఉదయం, ఆ నీటిని మీ ఇంటి ప్రధాన ద్వారం నుండి మొదలుకొని ఇల్లంతా చల్లండి.

చింతపండుకు పర్యావరణంలోని నెగటివ్ ఎనర్జీని గ్రహించే శక్తి ఉందని, దీనివల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరిగి, ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు.

అప్పుల బాధ నుండి విముక్తి పొందాలంటే..

ఆర్థిక సమస్యలు మిమ్మల్ని వెంటాడుతుంటే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది..

గురువారం లేదా శుక్రవారం నాడు ఒక చిన్న చింత చెట్టు కొమ్మను ఇంటికి తీసుకురండి.

దాన్ని గంగాజలంతో శుభ్రం చేసి, మీరు డబ్బు దాచుకునే సేఫ్ లేదా బీరువాలో ఉంచండి.

జ్యోతిష్య రహస్యం: చింతపండు రాహువు, శని గ్రహాలతో ముడిపడి ఉంటుంది. ఈ పరిహారం చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోయి, సంపద పెరిగే మార్గాలు సుగమం అవుతాయని నమ్ముతారు.

వాస్తు దోషాలు తొలగి మనశ్శాంతి కలగాలంటే..

ఇంట్లో వాస్తు దోషాల వల్ల మనశ్శాంతి కరువైనప్పుడు.. కొన్ని చింతపండు గింజలను ఒక ఎర్రటి గుడ్డలో కట్టి ఇంటి నైరుతి మూలలో లేదా ఏదైనా ఒక మూలలో ఉంచండి. ఇది ఇంటి యజమానికి మానసిక ప్రశాంతతను ఇస్తుంది.

Next Story