Sun Enters Libra on October 17: సెప్టెంబర్ నెల ముగిసి అక్టోబర్ ప్రారంభం కాబోతున్న వేళ జ్యోతిష్య పరంగా కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. పండుగల సందడి నెలకొనే ఈ అక్టోబర్‌లో ప్రధాన గ్రహాల సంచారం మానవ జీవితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపనుంది. ముఖ్యంగా నవగ్రహాలకు అధిపతి, అధికారం, కీర్తి ప్రతిష్టలు, నాయకత్వ లక్షణాలకు కారకుడైన సూర్య భగవానుడు అక్టోబర్ 17న కన్యారాశి నుంచి తులారాశిలోకి ప్రవేశించనున్నాడు. సూర్యుడు శుక్రుడికి చెందిన తులారాశిలోకి మారే ఈ సంచారం ద్వాదశ రాశులపై ప్రభావం చూపినప్పటికీ, ప్రత్యేకంగా నాలుగు రాశుల వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకోనున్నాయి. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల్లో వీరు ఊహించని విజయాలను అందుకోనున్నారు. ఆ అదృష్ట రాశుల వివరాలు..

మేష రాశి: పెండింగ్ పనులకు మోక్షం.. వ్యాపారంలో భారీ లాభాలు

తులారాశిలోకి సూర్యుడి మార్పు మేష రాశి వారికి అత్యంత శుభప్రదంగా మారనుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో పదోన్నతి, ఉన్నతాధికారుల మన్ననలు లభిస్తాయి. దాంపత్య జీవితంలో అనుకూలమైన మార్పులు వస్తాయి. పిల్లలు చదువులో రాణించి కుటుంబానికి మంచి పేరు తెస్తారు. వ్యాపారస్తులకు నూతన లావాదేవీలు కలిసివచ్చి విశేషమైన ఆర్థిక లాభాలు చేకూరుతాయి.

సింహ రాశి : అధిపతి అనుగ్రహం.. సర్వత్రా విజయాలే..

సింహ రాశికి అధిపతే సూర్యుడు కావడంతో ఈ సంచారం వీరికి గోల్డెన్ పీరియడ్ అనే చెప్పాలి. జీవితంలో సానుకూల శక్తి పెరిగి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. చేపట్టిన ప్రతి ప్రయత్నం సఫలమవుతుంది. వ్యాపారవేత్తలు అనుకున్నదానికంటే ఎక్కువ లాభాలను అందుకుంటారు. అన్ని రంగాల్లో విస్తరణకు అవకాశాలు ఉన్నాయి. పాత ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కుటుంబంతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు.

కన్యా రాశి : ఊహించని ధనలాభం.. జీవితంలో సరికొత్త మలుపు

సూర్యుడు కన్యారాశిని వీడి తులారాశిలోకి వెళ్లినప్పటికీ, ఈ రాశి వారికి అద్భుతమైన శుభ ఫలితాలు లభిస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు, ఉన్నత చదువులు చదివే వారు అత్యుత్తమ విజయాలను సాధిస్తారు. అకస్మాత్తుగా వచ్చే మార్పులు మీ ఆర్థిక పరిస్థితిని ఉన్నత స్థాయికి చేరుస్తాయి. ఊహించని ధన ప్రవాహం ఆశ్చర్యపరుస్తుంది. వృత్తిపరంగా నూతన అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆరోగ్యం మెరుగుపడి నూతన ఉత్సాహం సంతరించుకుంటారు.

వృశ్చిక రాశి: ప్రమోషన్లు.. విదేశీ యోగం

వృశ్చిక రాశి వారికి ఈ సూర్య సంచారం ఊహించని అదృష్టాన్ని మోసుకొస్తుంది. కార్యాలయంలో మీ పనితీరుకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఇంక్రిమెంట్లు, పదోన్నతులు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కలలు సాకారమవుతాయి. దీర్ఘకాలంగా వేధిస్తున్న అప్పులు, ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రణాళికలు సకాలంలో పూర్తవడంతో మానసిక ప్రశాంతత, సంతోషం లభిస్తాయి

Next Story