Sun-Ketu Conjunction on August 17: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి, వాటి కలయికకు ఎంతో ప్రాధాన్యత ఉంది. గ్రహాల రాజు అయిన సూర్యుడు, ఛాయా గ్రహమైన కేతువు ఒకే రాశిలో కలవబోతున్నారు. ఆగస్టు 17న ఈ రెండు శక్తివంతమైన గ్రహాలు సింహరాశిలోకి ప్రవేశించి జతకట్టనున్నాయి. ఒకే రాశిలో సూర్య-కేతువుల కలయిక కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తెచ్చిపెడితే, మరికొన్ని రాశుల వారిపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపనుంది. ముఖ్యంగా ఈ సంచారం వల్ల కొన్ని రాశుల వారికి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో సవాళ్లు ఎదురై, ఆత్మవిశ్వాసం తగ్గే ప్రమాదం ఉందని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ అదృష్టం లేని, జాగ్రత్తగా ఉండాల్సిన 3 రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం..

మిథున రాశి

సూర్య-కేతువుల కలయిక మిథున రాశి వారికి పలు ఇబ్బందులను తీసుకురావచ్చు. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార లావాదేవీల విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఊహించని ఆర్థిక నష్టాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కొత్తగా ఏవైనా వస్తువులు, ఆస్తులు లేదా వాహనాలు కొనాలని ప్లాన్ చేస్తుంటే కొన్ని అడ్డంకులు రావచ్చు. కాబట్టి కొద్దిరోజులు కొత్త నిర్ణయాలను వాయిదా వేయడం మంచిది. తొందరపడి పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. అలాగే ఇతరులతో చిన్న చిన్న విషయాలకు అనవసర వాదనలకు దిగకపోవడమే శ్రేయస్కరం.

కన్యా రాశి

సూర్య-కేతువుల గ్రహ సంచారం వల్ల కన్యా రాశి వారికి లాభాలతో పాటు కొన్ని తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అదుపు లేని అనవసర ఖర్చులు మీ జేబుకు పెద్ద కన్నం వేయవచ్చు. ఎవరితోనూ గొడవలు, వివాదాల్లోకి వెళ్లకుండా ఉండటం మంచిది. మీరు ఎంతో ముఖ్యంగా భావించే పెద్ద పనులు చివరి నిమిషంలో ఆగిపోయే ప్రమాదం ఉంది. ఇది మీకు తీవ్ర మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. పక్కవారి వ్యవహారాల్లో అనవసరంగా జోక్యం చేసుకోకండి.

మీన రాశి

మీన రాశి వారు ఈ సంచార సమయంలో కొన్ని ప్రత్యేక విషయాలపై శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా మీ ఆరోగ్యం విషయంలో అస్సలు నిర్లక్ష్యం తగదు. ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు ఆచితూచి అడుగు వేయాలి. మీరు చేసే ప్రతి పనిని కుటుంబ సభ్యులతో పంచుకోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే మనస్పర్థలు, విభేదాలను నివారించవచ్చు. వ్యాపారస్తులు పనిమీద సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. దాంపత్య జీవితంలో భాగస్వామి భావాలను, అభిప్రాయాలను గౌరవిస్తూ సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి.

PolitEnt Media

PolitEnt Media

Next Story