Sun Transit Impact: సూర్య గోచార ప్రభావం: పుష్యమి నక్షత్రంలోకి సూర్యుడి ప్రవేశం.. ఈ రాశుల వారికి ఇక తిరుగుండదు..
ఈ రాశుల వారికి ఇక తిరుగుండదు..

Sun Transit Impact: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాశి మార్పులతో పాటు నక్షత్ర మార్పులకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. గ్రహాల రాజుగా పిలవబడే సూర్య దేవుడు తాజాగా పుష్యమి నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. జ్యోతిష్య లెక్కల ప్రకారం.. సూర్యుడి ఈ నక్షత్ర గోచారం కారణంగా కొన్ని రాశుల వారికి పట్టబోయే అదృష్టం అంతా ఇంతా కాదు. ఈ మార్పు వల్ల ముఖ్యంగా తులా రాశితో పాటు మరికొన్ని రాశుల వారి జాతకాలు పూర్తిగా మారిపోనున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
తులా రాశి : ఆర్థిక విజయాలు, ఊహించని లాభాలు
సూర్యుడి నక్షత్ర మార్పు తులా రాశి వారికి అమితమైన లాభాలను చేకూర్చబోతోంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఈ సమయంలో వేగంగా పూర్తవుతాయి. అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. ఊహించని మార్గాల ద్వారా ఆదాయం సమకూరుతుంది. వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఆఫీసులో ప్రశంసలతో పాటు ప్రమోషన్ లేదా జీతం పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. కుటుంబంలో చాలా రోజులుగా ఉన్న విభేదాలు తొలగిపోయి, ప్రశాంత వాతావరణం నెలకొంటుంది.
సింహ రాశి : ఆత్మవిశ్వాసం, కీర్తి ప్రతిష్టలు
సూర్యుడు సింహ రాశికి అధిపతి కావడం వల్ల ఈ నక్షత్ర మార్పు వీరికి అనుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొత్త వ్యాపారాలు లేదా పనులు ప్రారంభించడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ధనూ రాశి : అదృష్ట కాలం, అనుకూల నిర్ణయాలు
సూర్యుడి గోచార ప్రభావం ధనూ రాశి వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. పట్టుదలతో చేసే పనులన్నింటిలో విజయం సాధిస్తారు. కోర్టు కేసులు లేదా వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే అవకాశాలు లభిస్తాయి. సుదూర ప్రయాణాలు లాభదాయకంగా మారుతాయి.
మేష రాశి వ: కొత్త అవకాశాలు, ప్రగతి
పుష్యమి నక్షత్రంలో సూర్యుడి సంచారం మేష రాశి వారికి కూడా ఎంతో మేలు చేస్తుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త డీల్స్ కుదురుతాయి. సమాజంలో పెద్దల పరిచయాలు ఏర్పడతాయి, ఇవి భవిష్యత్తులో మీకు ఎంతో సహాయపడతాయి. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది.

