Surya-Shani Shadashtak Yoga: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. తాజాగా గ్రహాల రారాజు సూర్యుడు తన స్వక్షేత్రమైన సింహరాశిలోకి ప్రవేశించగా, శనిదేవుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. దీనివల్ల వీరిద్దరి మధ్య 6వ, 8వ స్థానాల కలయికతో షడాష్టక యోగం ఏర్పడింది. జ్యోతిష్య పరంగా తండ్రీకొడుకులైన సూర్య-శనుల మధ్య సహజ వైరం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏర్పడిన షడాష్టక యోగం ప్రతికూల ఫలితాలను ఇస్తుందని, ముఖ్యంగా రెండు రాశుల వారి జీవితాల్లో తీవ్ర ఒత్తిడి, ఆర్థిక ఆటంకాలను తెచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మకర రాశి

శని అధిపతిగా ఉండే మకర రాశి వారికి ఈ సమయం ఎంతో పరీక్షా కాలం. ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగులు వేయడం మంచిది. పెద్ద మొత్తంలో లావాదేవీలు చేసేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం. భారీ రిస్క్‌తో కూడిన పెట్టుబడులకు దూరంగా ఉండాలి. అనవసర ఖర్చులను నియంత్రించుకోకపోతే ఆర్థిక స్థిరత్వం దెబ్బతింటుంది. పని ప్రదేశంలో ఊహించని ఎదురుదెబ్బలు తగలవచ్చు. సహోద్యోగుల నుంచి ప్రతికూల వ్యాఖ్యలు, విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉంది.

కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సహనం ముఖ్యం. మాట తూలితే బంధాలు దెబ్బతింటాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు, ప్రయాణాల సమయంలో అప్రమత్తంగా ఉండాలి.

కుంభ రాశి

శని పాలిత రాశి అయిన కుంభ రాశి వారికి ఈ గ్రహ సంచారం పలు సవాళ్లను మోసుకొస్తుంది. ఊహించని ఖర్చులు మీదపడతాయి. ఇతరులకు చేతిబదుళ్లు లేదా అప్పులు ఇచ్చేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. తొందరపడి కొత్త పెట్టుబడులు పెట్టకూడదు. ఉద్యోగ లేదా వ్యక్తిగత కారణాల వల్ల ఇంటికి దూరంగా ఉండాల్సి రావచ్చు. ఆఫీసులో వివాదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. చిన్న చిన్న మనస్పర్థలు పెద్ద సమస్యలుగా మారే ప్రమాదం ఉంది కాబట్టి సంయమనం పాటించాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్యంతో పాటు వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story