ఏఈఓ రాజశేఖర్ బాబు సస్పెన్షన్

TTD: టీటీడీలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏ.రాజశేఖర్ బాబును సస్పెండ్ చేస్తూ టీటీడీ ఈవో శ్యామల రావు ఆదేశాలు జారీ చేశారు. ఆయన ప్రవర్తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ చేసినట్లు టీటీడీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తిరుపతి జిల్లా పుత్తూరులోని స్వగ్రామంలో రాజశేఖర్ బాబు ప్రతీ ఆదివారం స్థానిక చర్చి ప్రార్థనల్లో పాల్గొంటున్నారని సమాచారం అందింది. ఆయన చర్చ్ కు వెళ్లిన వీడియోలు సోషియల్ మీడియాలో సైతం వైరల్ గా మారాయి. ఈ వ్యవహారంతో టీటీడీ ఉద్యోగిగా ఆయన సంస్థ ప్రవర్తనా నియమావళిని పాటించలేదని భావించడమేకాక, హిందూ ధార్మిక సంస్థకు ప్రాతినిధ్యం వహించే ఉద్యోగి అయివుండి భాద్యతారహితంగా వ్యవహరించడం జరిగిందని టీటీడీ నిర్ధారణకు వచ్చింది. ఈ క్రమంలో టీటీడీ విజిలెన్స్ విభాగం సమర్పించిన నివేదికను, ఇతర ఆధారాలను పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం ఆయనపై శాఖపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఆయన్ను తక్షణమే సస్పెండ్ చేసినట్లు టీటీడీ వెల్లడించింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story