ఈ రత్నం ధరిస్తే తిరుగుండదా?

Symbol of Courage and Success: వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. పగడం అంగారక గ్రహానికి ప్రతినిధి. ఒక వ్యక్తిలో బలం, ధైర్యం, పోరాట స్ఫూర్తిని నింపే శక్తి ఈ రత్నానికి ఉంది. అయితే జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నప్పుడు లేదా దోషాలు ఉన్నప్పుడు పగడాన్ని ధరిస్తే అద్భుతమైన మార్పులు వస్తాయని పండితులు చెబుతున్నారు.

పగడం ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు

ఆత్మవిశ్వాసం: భయం, ఆందోళనలను తొలగించి వ్యక్తిలో ఆత్మవిశ్వాసాన్ని, నిర్ణయాత్మక శక్తిని పెంచుతుంది.

మంగళ దోష నివారణ: వైవాహిక జీవితంలో సమస్యలు సృష్టించే మంగళ దోష ప్రభావాన్ని తగ్గించడంలో పగడం కీలక పాత్ర పోషిస్తుంది.

వృత్తిపరమైన విజయం: ముఖ్యంగా సైనికులు, పోలీసులు, అథ్లెట్లు, ఇంజనీర్లు, నాయకత్వ బాధ్యతల్లో ఉన్నవారికి ఇది అత్యంత అనుకూలమైన రత్నం.

శారీరక ధృడత్వం: ఇది శరీరంలో శక్తిని, ఓర్పును పెంచుతుంది. రక్త సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని నమ్ముతారు.

నిజమైన పగడాన్ని ఎలా గుర్తించాలి?

మార్కెట్లో నకిలీ పగడాలు ఎక్కువగా దొరుకుతున్న తరుణంలో, అసలైన దాన్ని గుర్తించడం ముఖ్యం.

పగడం సహజంగా సముద్ర జీవుల ద్వారా ఏర్పడుతుంది.

మంచి నాణ్యత గల పగడం పగుళ్లు లేకుండా, మృదువైన ఉపరితలంతో ఉంటుంది.

దీని రంగు లేత ఎరుపు నుంచి ముదురు ఎరుపు వరకు ఉంటుంది మరియు గాజులాంటి మెరుపును కలిగి ఉంటుంది.

ధరించే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

చాలామంది జాతకం చూపించుకోకుండా పగడాన్ని ధరిస్తుంటారు. ఇది చాలా పెద్ద తప్పు.

కోపం పెరుగుతుంది: ఒకవేళ జాతకంలో కుజుడు ఇప్పటికే బలంగా ఉంటే, పగడం ధరించడం వల్ల విపరీతమైన కోపం, తొందరపాటు నిర్ణయాలు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

ప్రయోగాత్మకంగా చూడండి: పగడాన్ని శాశ్వతంగా ధరించే ముందు కొన్ని రోజులు ప్రయోగాత్మకంగా ధరించి, మీ ప్రవర్తనలో మార్పులను గమనించడం మంచిది.

నిపుణుల సలహా: మీ శరీర బరువు, జాతక స్థితిని బట్టి ఎన్ని క్యారెట్ల పగడం ధరించాలో జ్యోతిష్కుడిని అడిగి తెలుసుకోవాలి. సాధారణంగా 5 నుంచి 9 క్యారెట్ల వరకు సిఫార్సు చేస్తారు.

ఎప్పుడు, ఎలా ధరించాలి?

రోజు: మంగళవారం ఉదయం (శుక్ల పక్షం).

వేలు: కుడి చేతి ఉంగరపు వేలుకు ధరించాలి.

లోహం: బంగారం లేదా రాగి ఉంగరంలో పొదిగించి ధరించడం శ్రేయస్కరం.

మంత్రం: ధరించే సమయంలో 'మంగళ మంత్రాన్ని' జపించడం వల్ల ఫలితాలు త్వరగా అందుతాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story